- Advertisement -
మైలవరం: ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండలం వెలగలెరు గ్రామం వద్ద పట్టిసీమ నుండి పోలవరం కుడి కాలువ ద్వారా వస్తున్న గోదావరి జలాలకు హారతి ఇచ్చారు మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. వాటర్ మేనేజ్మెంట్ లో ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని,నేడు 13 లక్షల ఎకరాల డెల్టా ఆయకట్టులో 10 లక్షల ఎకరాలను చంద్రబాబు విజన్ బతికించిందని,పోలవరం ప్రాజెక్టును బ్యారేజీ చేశారు పోలవరం నిర్వాసితులను గోదావరిలో ముంచారని అన్నారు.లక్షల కోట్లు పెట్టిన ప్రాజెక్టులు పక్క రాష్ట్రాల్లో కృంగిపోయాయి 1400 కోట్ల పట్టిసీమ నేటికీ పలాలను అందిస్తుందని అన్నారు.
- Advertisement -



