పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి
-బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్..
కామారెడ్డి / జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి, డిసెంబర్ 15 ( వాయిస్ టుడే )
కామారెడ్డి జిల్లా : బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కారానికై కృషి చేయాలి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కాలర్షిప్ లోని విడుదల చేయాలి సుమారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 83 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది బిసి విద్యార్థులకు సుమారు 100 కోట్లు రావాల్సింది గత సంవత్సరం నుండి ఇప్పటివరకు ఏ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం మనుష్యం ఒకవైపు స్కాలర్షిప్ రాక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చితుక కళాశాలలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవైపు పట్టణంలో ఉన్నటువంటి కళాశాల యజమాన్యం విద్యార్థుల సర్టిఫికెట్ల కోసం పోతే పూర్తి డబ్బులు చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని వేధిస్తున్నారు తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఆర్ విజయ్ కుమార్. జిల్లా నాయకులు నిఖిల్ గౌడ్. మండల అధ్యక్షుడు రాఘవ. మండల నాయకులు నవీన్. రాజు. విష్ణు. సాయి. తదితరులు పాల్గొన్నారు.



