Friday, January 3, 2025

తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే  

- Advertisement -

తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే  

కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

జగిత్యాల
వయోవృద్ధులైన తల్లిదండ్రులకు  సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని    కలెక్టర్ షేఖ్ యాస్మిన్ భాష   అన్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల  కాంప్లెక్స్ లోని కలెక్టర్ ఛాంబర్లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా  అధ్యక్షుడు   హరి ఆశోక్ కుమార్   ఆధ్వర్యంలో  8వ తెలంగాణ అల్  సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేక మెమోంటో , రాష్ట డిప్యూటీ సీఎం.మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా  ఆవిష్కరించిన రాష్ట్ర  అసోసియేషన్ ముద్రించిన  వయోవృద్ధుల సంరక్షణచట్టం  అవగాహన  పుస్తకం,2024 డైరీని  కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా కు అందజేశారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయో వృద్ధుల కోసం ప్రత్యేక  టోల్ ఫ్రీ నెంబర్ 14567 ఉందని,వృద్ధ తల్లిదండ్రులను నిరాదరిస్తున్న,
వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు.వేధింపులకు గురి చేసిన వారికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్ష ,జరిమానా విధించే వీలుందన్నారు. జిల్లాలో వయోవృద్దుల సంరక్షణ చట్టం మేరకు తల్లిదండ్రులను  నిరాదరిస్తున్న కొడుకులు
,కూతుర్లు,కోడళ్లకు కౌన్సెలింగ్ లు చేస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తున్న అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు.
అసోసియేషన్ సేవలను  మరింతగా విస్తరింప జేస్తూ  బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో  సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత్ రెడ్డి, బొల్లం విజయ్,ఎండి.యాకూబ్,
ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల అశోక్ రావు, జగిత్యాల  పట్టణ అధ్యక్షుడు సతీష్ రాజ్,
కార్యదర్శి మానాల కిషన్,
కోశాధికారి సింగం గంగాధర్,
,ప్రతినిధులు వేముల దేవరాజం,నారాయణ,దేవేందర్ రావు,పబ్బా శివానందం, ఎండి.ఎక్బాల్,సయ్యద్, యూసుఫ్,జిల్లా,డివిజన్,మండలాల ,గ్రామాల సీనియర్ సిటీజేన్స్  ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్