Friday, January 3, 2025

రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌ సబ్సిడీ 60 శాతానికి  పెంపు

- Advertisement -

రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌ సబ్సిడీ 60 శాతానికి  పెంపు
కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 03
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌కు ఇస్తున్న సబ్సిడీని భారీగా పెంచేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది. ఇప్పుడు 40 శాతం సబ్సిడీ ఇస్తుండగా.. దానిని 60 శాతం పెంచేందుకు సిద్ధమైనట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. దేశంలో విద్యుత్ వినియోగం నానాటికి పెరిగిపోతుంది. దీంతో.. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా పునరుత్పత్తి ఇంధనాన్ని వినియోగించుకునేలా.. సౌర వ్యవస్థ ద్వారా విద్యుత్ పొందేందుకు వీలుగా సోలార్ సిస్టమ్‌ను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే, సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలంటే.. భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు అంత మొత్తం వెచ్చించలేని స్థితి ఉంటుంది. అందుకే.. ప్రజలకు రుణ భారం లేకుండా భారీగా సబ్సిడీ ఇస్తూ సోలార్ సిస్టమ్‌ను అందజేసేందుకు ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద.. సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసుకునే వారికి 40 శాతం సబ్సిడీ అందించేది కేంద్ర ప్రభుత్వం.
సబ్సిడీ పెంపు..
ప్రస్తుతం ఇస్తున్న 40 శాతం సబ్సిడీని 60 శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న వినియోగదారులు సోలార్ సిస్టమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. కేంద్రం 60 శాతం సబ్సిడీతో సోలార్ సిస్టమ్‌ను అందిస్తుంది. మిగిలిన 40 శాతం రుణాన్ని లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది.కాగా, ఈ పథకం ప్రతి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు(సీపీఎస్‌ఈ) ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్‌పీవీ) ద్వారా ఈ పథకం అమలు చేయడం జరుగుతుంది. ఇక రుణాలు చెల్లింపు కాల పరిమితి 10 సంవత్సరాల వరకు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే, 40 శాతం డబ్బులు ఎప్పుడైతే చెల్లిస్తారో.. అప్పుడే రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టాలేషన్ చేస్తారు. ఒకవేళ మీ అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి అయినట్లయితే.. దానిని డిస్కమ్‌లకు విక్రయించవచ్చునని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ పథకానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది. ఈ పథకం ద్వారా 10 మిలియన్ల మంది లబ్ధిదారులు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌ల ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను పొందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. దీనిద్వారా సంవత్సరానికి రూ. 15,000 నుంచి 1,80,000 వరకు ఆదా అవుతుందని చెప్పారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ మాట్లాడుతూ.. రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లను కేటాయించడం జరిగిందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్