తన ‘ప్రాణాలకు ముప్పు!?’.. జగన్‌పై షర్మిల సంచలన ఆరోపణలు..
అమరావతి, ఫిబ్రవరి 07
తన భద్రత విషయంలో ఏపీ సీఎం జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఏదో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనకు సెక్యూరిటీ కల్పించకపోవడం అంటే.. తన చెడు కోరుకుంటున్నారనేగా అర్థం అని అన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన వైఎస్ షర్మిల.. భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర కామెంట్స్ చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో తాను తిరిగినప్పుడు తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు షర్మిల. కానీ, అందుకు విరుద్ధంగా భద్రతను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఒక మహిళని అని కూడా చూడకుండా, ఒక పార్టీకి అధ్యక్షురాలిని అనే గౌరవం కూడా లేకుండా అవమానిస్తున్నారని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తనకు సెక్యూరిటీ కల్పించడం లేదంటే ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. ‘మీకు సెక్యూరిటీ, మీ పెద్ద కోటలో మీరు ఉంటే సరిపోతుందా?’ అని సీఎం జగన్‌ను నేరుగా అటాక్ చేశారు. ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అని ఫైర్ అయ్యారు. అంతేకాదు.. తనకు సెక్యూరిటీ కల్పించకపోవడం అంటే.. తన చెడు కోరుకుంటున్నారనేగా అర్థం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం సంభవించడమే కాక, ప్రమాదం కల్పించే వారిలో కూడా మీవారు కూడా ఉంటారనేగా దాని అర్థం అంటూ సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల.సంచలన ఆరోపణలు చేశారు
తన ‘ప్రాణాలకు ముప్పు!?’.. జగన్‌పై షర్మిల సంచలన ఆరోపణలు..
- Advertisement -
- Advertisement -