చేర్వుగట్టుకు రెండవ ఘాట్ రోడ్డు
మంత్రి కోమటిరెడ్డి
సూర్యాపేట
తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న చెరువుగట్టు దేవాలయంలో జరిగిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గోన్నారు.అయనను అర్చకులు పూర్ణకుంభంతో మంత్రిని స్వాగతించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలుపై మంత్రి అధికారులను అడిగితెలుసుకున్నారు. ఎక్కడా ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల విరేశం కుడా కళ్యాణోత్సవంలో మంత్రితో కలిసి పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ భక్తులంతా భక్తిశ్రద్ధలతో.. ప్రశాంతంగా పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి దంపతులను దర్శించుకోవాలని.. భోజనాలతో సహా అన్నీ సౌకర్యాలు కల్పించామని.. కాబట్టి ఎలాంటి తొక్కిసలాట లేకుండా ఆ ఆది దంపతులను దర్శించుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే మూడు నెలల్లో బ్రాహ్మణ వెళ్ళేంల ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేస్తాం. మొదటి విడతలో 60 వేల ఎకరాలకు నీటి విడుదల చేస్తాం. అదే రోజు మహాత్మాగాంధీ యూనివర్సిటీ, చెర్వుగట్టులో సీఎం రేవంత్ రెడ్డిచే సమీక్ష వుంటుంది. చెర్వుగట్టుకు రెండో ఘాట్ రోడ్డు, భక్తులు నిద్రించేందుకు మౌలిక వసతులు కల్పిస్తాం. జిల్లాలో ప్రస్తుతం నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే కాలంలో బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎల్ బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించి పేదల గుండెల్లో ఉంటామని అన్నారు.
చేర్వుగట్టుకు దేవాలయంలో స్వామి వారి కళ్యాణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గోన్నారు.
- Advertisement -
- Advertisement -