నగరంలోని ముఖ్యమైన జంక్షన్ లను తనికిచేసిన జిల్లా ఎస్పీ
తిరుపతి నగరంలో వన్ ‘వే ‘లను ను అమలు చేయాలి
ఎస్పీ హర్షవర్ధన్ రాజు
తిరుపతి
తిరుపతిలోని గాంధీ రోడ్డు, చిన్న బజారు వీధి, తీర్థకట్ట వీధి, బండ్ల వీధి,కరణాల వీధి మరియు బేరి వీధి వీధులలో ఖచ్చితముగా వన్ వే అమలు చేయాలి. పూల మార్కెట్ షాపులకు ఇరువైపుల ఉన్నటువంటి అడ్డంకులను తొలగింఛి పదచారులకు ఆటంకంలేకుండా చూడాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నార.
శ్రీ గోవిందరాజస్వామి ఉత్తర మాడా వీధిలో వాహనాలు పార్కింగ్ అమలు చేయాలి. గోవిందరాజ స్వామి గుడి వెనకాల ఉన్నటువంటి స్టేట్ బ్యాంకు అధికారు లకు బ్యాంకు ముందు వాహనములు పార్క్ చేయనీయకుండా సెక్యూరిటీని ఉంచమని సూచించారు.రైల్వే స్టేషన్ ను ముందర పరిశీలించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడమన్నారు. రైల్వే స్టేషను ముందర ఆటో స్టాండ్ వారితో మాట్లాడి చిన్న సమస్యలు పరిష్కరించాలని ట్రాఫిక్ డిఎస్పీ ని ఆదేశించారు.
తిరుపతిలో ని పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న కృష్ణాపురం తానా జంక్షన్, ను నిత్యం రద్దీగా ఉండే గాంధీ రోడ్ ను పూల మార్కెట్ను, శ్రీ గోవిందరాజు స్వామి దక్షిణమాడా వీధి, రైల్వే స్టేషన్ ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ దారి మళ్లింపు సూచికలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముఖ్యమైన కూడలల్లో ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కాకుండా మూక్య స్కూలు , కాలేజీ విద్యార్థులు వెళ్ళు సమయంలలో కూడా ట్రాఫిక్ సమస్య రాకుండా క్రమబద్ధీకరించాలని రమణ కుమార్ ట్రాఫిక్ డిఎస్పికి ఆదేశాలు ఇవ్వడమైనది.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు రమణ కుమార్ తిరుపతి ట్రాఫిక్, రవి మనోహరాచారి తిరుపతి, సిఐలు, ఎస్ ఐ లు ,మరియు సిబ్బందిపాల్గొన్నారు.
నగరంలోని ముఖ్యమైన జంక్షన్ లను తనికిచేసిన జిల్లా ఎస్పీ
- Advertisement -
- Advertisement -



