హనుమయ్య..
ఇవేం మోసాలయ్యా?
దోషం పోవాలంటే దీపాలు వెలిగించాల్సిందే
శ్రీకాళహస్తి జులై 4
శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులను దుకాణాదారులు,దళారులు వీలైనంతగా మోసాలకు గురి చేస్తున్నారు. సన్నిధి వీధిలోని రామాలయం వద్ద హనుమంతుని విగ్రహం ముంది. రాహు కేతు కాలసర్ప దోష పూజలు నిర్వహించుకునే ముందు భక్తుల కు అవసరం లేకున్నా బలవంతంగా ఒక్కో పసుపు దారం రూ 50 వంతున ఆయన కాళ్లకు కట్టిస్తూ, అదేవిదంగా దోషాలు తొలగిపోవాలంటే నేతి దీపాలు తప్పనిసరిగా వెలిగించాలని భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో దీపాలు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క దీపం రూ 200 తో దుకాణదారులు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఆంజనేయ స్వామి పాదాల చుట్టూ ఈ పసుపు దారాలు పేరుకుపోయాయి. ఇకనైనా ఈ తరహా మోసాలను అడ్డుకట్ట వేసే విధంగా ఆలయ అధికారులు శ్రద్ధ చూపాల్సి ఉంది