- Advertisement -
జిల్లాలో కుండపోత వర్షాలు
Heavy rains in the districtకాకినాడ
కాకినాడ జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. అయితే బుధవారం ఉదయం నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. దీనికి తోడు ఈదురుగాలులు తోడయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ అంచనాల మేరకే వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యార్థులు విద్యాసంస్థలకు వెలకెందుకు ఇబ్బందులు పడుతున్నారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి .తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బోట్లు లంగర్ వేసి మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. రెండు రోజులపాటు వర్షాలు ఉంటాయని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరించింది
- Advertisement -




