- Advertisement -
మాగుంట పార్వతమ్మకు ఘన నివాళులు
Tributes to Magunta Parvathammaకావలి
కావలి బ్రిడ్జి సెంటర్ల లో ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి ప్రజల అమ్మ మాగుంట పార్వతమ్మ మరణం రాజకీయ పార్టీలకు కావలి పట్టణ ప్రజలకు తీరని లోటు. నిత్యం కావలి పట్టణంలో ఎవరో ఒకరితో మమేకమవుతు తన భావాలు పంచుకునేంత కావలితో మమేకమైంది పార్వతమ్మ జీవితం. నా రాజకీయ ఆరెంగేట్రం మాగుంట పార్వతమ్మ దయే. జలదంకి సొసైటీ అధ్యక్షుడిగా.. జలదంకి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేయడం పార్వతమ్మ ఆశీస్సులతోనే. భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి మెట్టినింటికి పుట్టినింటికి వన్నెతెచ్చిన మహనీయురాలు మాగుంట పార్వతమ్మ. నిత్యం ప్రజా సేవకై పరితపించిన మానవతా మూర్తి మాగుంట పార్వతమ్మ. జన్మనిచ్చిన తల్లి కంటే మాగుంట పార్వతమ్మ దగ్గర పది నిమిషాలు కూర్చుంటే ఆ అనుభూతిని మర్చిపోతాం. సామాన్య కార్యకర్త కోసం జిల్లా కలెక్టర్ నుండి ముఖ్యమంత్రి వద్దకు సైతం వెళ్లి పని పూర్తి చేయడం ఆమె నైజం. ఈరోజు మనం నడిచే కావలి ట్రంకు రోడ్డు ఆ మహాతల్లి బిక్ష కావలి ట్రంకు రోడ్డుకు మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డుగా నామకరణం చేస్తున్నాం. త్వరలో మున్సిపాలిటీలో తీర్మానం కూడా చేస్తామని అన్నారు.
- Advertisement -




