వీరంపాలెంలో అక్టోబర్ మూడు నుంచి దసరా ఉత్సవాలు
Dussehra celebrations in Veerampalem from October 3తాడేపల్లిగూడెం,సెప్టెంబర్ 25,
తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పంచాయతీ నక్షత్రంలో దసరా ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి 13వ తారీకు వరకు నిర్వహించినట్టు పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకటరమణ సిద్ధాంతి తెలియజేశారు. క్షేత్రంలో పది రోజులపాటు నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నవరాత్రుల్లో విశేషాలంకరణలు చేయనున్నట్టు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంపూర్ణ చండీ హోమం కొనసాగించనున్నట్టు పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల పది రోజులు పీఠం భక్త బృందంతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. భక్తలు దసరా మహోత్సవాల్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారి నీ దర్శించుకుని తరించాలని పిలుపునిచ్చారు.



