బతుకమ్మ (పూల పండుగ)శుభాకాంక్షలు
Happy Bathukamma (Flower Festival) Festival
*ఎంపీ వద్దిరాజు శుభాకాంక్షలు*
*Date 01/10/2024*
*రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బతుకమ్మ (పూల పండుగ) పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు* *ఆడబిడ్డలందరూ వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఒక చోట గుమిగూడి ఆనందోత్సవాల మధ్య ఆడుతూ పాడుతూ తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకునే పండుగ అని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు* *తెలంగాణ ప్రాంతంలో ఆనాదిగా జరుపుకుంటున్న ఈ పండుగకు కేసీఆర్ నాయకత్వాన ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చిందని ఎంపీ వద్దిరాజు వివరించారు* *బతుకమ్మ పండుగ సందర్భంగా కేసీఆర్ పాలనలో పేదింటి ఆడబిడ్డలకు చీరలు బహుమతిగా అందజేసి గౌరవించడం జరిగిందని గుర్తు చేశారు* *భక్తి ప్రపత్తులతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవలసిందిగా ఆడబిడ్డలను ఎంపీ రవిచంద్ర కోరారు*



