ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ సినిమా కాస్త ఆలస్యంగా రిలీజ్

- Advertisement -

ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ సినిమా కాస్త ఆలస్యంగా రిలీజ్
The movie ‘Adarsha Kutumbam House No. 47’ has been released with a slight delay.
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – AK47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటించారు.
సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “మూడు నాలుగు రోజుల క్రితం కూడా అక్టోబర్ 9నే సినిమా విడుదలవుతుందని మేమందరం ఎంతో నమ్మకంగా ఉన్నాం. అందుకే ఓవర్సీస్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేయించాము. కానీ, నిన్న ఉదయానికి కూడా ఓవర్సీస్ సెన్సార్ కి కంటెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పరంగా మూడు నాలుగు రోజులు వెనకబడిపోయాము. ఈ పరిస్థితుల్లో కంగారుగా సినిమాను విడుదల చేసేకంటే.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని, క్వాలిటీ అవుట్ పుట్ తో మీ ముందుకు రావాలనే ఉద్దేశంతోనే ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నాము. పైగా, ప్రమోషనల్ కార్యక్రమాలకు కూడా సమయం లేకుండా పోయింది. రెండు మూడు వారాల తర్వాత సరైన తేదీ చూసుకొని, వెంకటేష్ గారితో చర్చించి, కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాము. మిగతా పాటలను, ట్రైలర్ ను విడుదల చేసి రాబోయే రెండు మూడు వారాల పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి.. వీలైనంత త్వరగా మీ ముందుకు వస్తాము. ‘ఆదర్శ కుటుంబం’ కాస్త ఆలస్యంగా వచ్చినా..వెంకటేష్ గారి అభిమానులంతా నూటికి నూరు శాతం సంతృప్తి చెందేలా సినిమా ఉంటుంది.” అన్నారు.
ఇప్పటికే విడుదలైన ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్‌కు మంచి స్పందన లభించింది. వెంకటేష్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించడంతో పాటు.. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్‌తో టీజర్ ఆసక్తిని పెంచింది. ఈ టీజర్ ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఇటీవల మొదటి గీతంగా విడుదలైన ‘నారాయణమ్మ’ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. త్వరలోనే మిగతా పాటలు, ట్రైలర్ తో ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular