నవంబర్ 11 నుండి మంథనిలో మజారుద్దీన్ స్మారక క్రీడా పోటీలు
Mazaruddin Memorial Sports Competition in Manthani from November 11మంథని
మంథని మున్సిపాలిటీ పరిధిలో మజారుద్దీన్ స్మారక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి పేర్కొన్నారు మంగళవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండేల మారుతి మాట్లాడుతూ నవంబర్ 11 నుండి 13 వరకు మంథని ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నామని, హై స్కూల్ నుండి డిగ్రీ విద్యార్థులు బాలికలకు కోకో రన్నింగ్ పోటీలు, బాలురకు కబడ్డీ రన్నింగ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ కు స్పీడ్ వర్క్ పోటీలు నిర్వహిస్తామన్నారు ఈ పోటీలో పాల్గొనదలచిన వారు నవంబర్ 5లోగా ఎంట్రీలను మంథని విద్యార్థి యువత పేరున పంపాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 9347590795 నెంబర్ను సంప్రదించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణ కమిటీ సభ్యులు సయ్యద్ సిరాజుద్దీన్, రావికంటి సుభాష్ లు పాల్గొన్నారు..




