కాల్దారిలో పెన్షన్ పంపిణీలో పాల్గోన్న మంత్రి దుర్గెష్

- Advertisement -

కాల్దారిలో పెన్షన్ పంపిణీలో పాల్గోన్న మంత్రి దుర్గెష్

Minister Durgesh participated in the distribution of pension in Kaldari

నిడదవోలు
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ  ప్రజల సామాజిక భద్రతే కూటమి ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.  ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ డబ్బును పంపిణీ చేసారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలా లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందని  మంత్రి  అన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా పెన్షన్ పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యం.  పేదల కళ్లలో ఆనందం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular