విజయవంతంగా జరిగిన మెడికల్ క్యాంపు…
A successful medical camp...ప్రభుత్వ రంగంలో వైద్యం సేవలను పెంచాలి
– నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం
విద్య, వైద్యం రంగాలను పూర్తిగా ప్రభుత్వ పరం చేయాలని, ప్రధానంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా వున్న వైద్యులు, మరియు నర్సుల పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో ప్రతి నెలా ఒక ప్రత్యేకమైన హెల్త్ డాక్టర్ తో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. శనివారం మంచికంటి భవన్ లో సి పి ఎం పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ, బోడేపూడి విజ్ఞాన కేంద్రం ( సి పి ఎం ) ఆధ్వర్యంలో బిపి, షుగర్ మెడికల్ క్యాంపు విజయవంతం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన నున్నా నాగేశ్వరరావు మెడిసిన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఉచితంగా ఖమ్మం జిల్లాలో నడుస్తున్న ఏకైక మెడికల్ క్యాంపు ఇదే అని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ప్రతి మనిషి ఆరోగ్యంగా వుండాలంటే పౌష్టికాహారం అవసరం ఉందని, ఆరోగ్యకరమైన జీవితాలను ఇవ్వాలని బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. క్యాన్సర్, హార్ట్ తదితర రోగాలు ఈమధ్య కాలంలో బాగా పెరిగాయి అని, వీటికి చికిత్స కోసం ప్రయివేటు ఆసుపత్రికి వెళితే ఆస్తులు అమ్ముకునే స్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం న్యూరో ఫిజీషియన్ డాక్టర్ జడల రణధీర్ రోగులను పరీక్షించి రెండు వందల మంది పేషెంట్లకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కంటి పరిక్షలు, షుగర్, బిపి సేవలను ఉచితంగా నిర్వహించారు. అనంతరం బిపి షుగర్ కు నెలకు సరిపడా మందులు అందించారు. ప్రముఖ డాక్టర్ రాజేష్ చెవి, ముక్కు, గొంతు వైద్య సేవలు అందించారు.
ప్రముఖ డాక్టర్ సి.భారవి, డాక్టర్ రావిళ్ళ రంజిత్, డాక్టర్ కొల్లి అనుదీప్ ,డాక్టర్ పి సుబ్బారావు , డాక్టర్ జెట్ల రంగారావు పేషెంట్లను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో సి పి ఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, బి వి కె ట్రస్ట్ మేనేజర్ వై.శ్రీనివాసరావు, సి పి ఎం పార్టీ టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, సుబ్బారావు, పి.ఝాన్సీ, అఫ్జల్, వాసిరెడ్డి వీరభద్రం , నర్రా రమేష్, పి వాసు, మల్లికార్జున్ రెడ్డి, గుమ్మడి బిక్షం, తదితరులు పాల్గొన్నారు




