గూడెం”లో ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం

- Advertisement -

గూడెం”లో ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం

Opening of The Zampeta Cooperative Urban Bank Branch at Goodem

తాడేపల్లిగూడెం,నవంబర్ 04
ప్రముఖ వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెంలో ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 12వ బ్రాంచ్ ను ఆదివారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల మల్లికార్జునరావు (బాబ్జి) జ్యోతి ప్రజ్వలన చేశారు. అతిథులు చేతుల మీదుగా బ్యాంకులోని వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ బొమ్మన జయ కుమార్, వైస్ చైర్మన్ రొబ్బి విజయ శేఖర్, విశాఖపట్నం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్, తణుకు వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎం. వెంకటరత్నం, ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర రావు, ది ఇన్నిస్ పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోలా అచ్యుతరామయ్య విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవో ఎం. విజయ ప్రతాప్, డిప్యూటీ సీఈవో ఎన్.భరణి కుమార్, బ్యాంకు డైరెక్టర్లు, వివిధ బ్రాంచీల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలే భాగస్వామ్యులుగా సహకార రంగంలో బ్యాంకులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. మరో ఏడాదిలో 100 వ సంవత్సరంలో కి అడుగు పెడుతూ అడుగు పెడుతూ 12వ బ్రాంచిగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి అన్నారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ బ్యాంకు ద్వారా విశిష్టమైన సేవలు అందించాలని ఆయన కోరారు. బ్యాంకు చైర్మన్ బొమ్మన జయ కుమార్ మాట్లాడుతూ 1926లో కేవలం 500 రూపాయలతో ప్రారంభమైన ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నేడు అందరి సహకారంతో 720 కోట్లు రూపాయలు బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఖాతాదారులకు విశేషమైన సేవలు అందిస్తుందన్నారు. తమ బ్యాంకు ఇప్పటికే 11 బ్రాంచ్ లు కలిగి ఉందని, 12వ బ్రాంచ్ ను తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేశామన్నారు. 444 కోట్ల రూపాయల డిపాజిట్లు, 276 కోట్ల రూపాయలు రుణాలు కలిగి ఉందన్నారు. బ్యాంకుకు ఎటువంటి నికర నిరర్థక ఆస్తులు లేకపోవడం బ్యాంకు పని తీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సహకార2 బ్యాంకులో 30 వేల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఖాతాదారుల సేవలో 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 వ సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నామని బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయ కుమార్ తెలియజేశారు. ఖాతాదారులు ఎస్ బి అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఖాతాదారుడికి పాస్ బుక్, ఏటీఎం కార్డు, పేరుతో చెక్ బుక్ తక్షణమే అందజేయడం బ్యాంకు ప్రత్యేకత అన్నారు. డిపాజిట్లు మీద అత్యధికంగా 8.1 శాతం వడ్డీ ఇస్తున్నామన్నారు. సీనియర్ సిటిజనులకు అయితే మరొక 0.5 శాతం అదనపు వడ్డీ వస్తుంది అన్నారు. బ్రాంచ్ ప్రారంభోత్సవ కానుకగా డిపాజిట్లు మీద ఒక శాతం వడ్డీ అదనంగా ఇస్తున్నామన్నారు. ఎటువంటి రుణం మంజూరు కైనా ఐదు,ఆరు రోజుల్లోనే ప్రాసెసింగ్ పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు. బంగారం మీద రుణంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఉందన్నారు. అలాగే వ్యాపారులు, బిల్డర్లకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా క్యూఆర్ కోడ్, యూపీఐ? ఫోన్ పే వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. ప్రతి బ్రాంచ్ లోను ఏటీఎం సౌకర్యం, లాకర్ సదుపాయం కల్పించామన్నారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular