Sunday, February 15, 2026

వేములవాడలో మంత్రి పొన్నం

- Advertisement -

వేములవాడలో మంత్రి పొన్నం

Minister Ponnam in Vemulawada

వేములవాడ
కార్తీక సోమవారం సందర్భంగా  వేములవాడ లో శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు దర్శించుకున్నారు. మంత్రి పొన్నం స్వామి వారికి గోపూజ నిర్వహించి కోడే మొక్కులు చెల్లించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కి ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించమని ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదు.. బలహీన వర్గాలకు మాత్రమే పరిమితమైంది కాదు . తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారం.. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ లకు ఏం చేసిందని అంటున్నారు. అసలు బీసీ ల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్,  బీసీ గురించి మాట్లాడే వరకు ఉండాలంటే మీ పార్టీ అధ్యక్ష పదవి ,కార్యనిర్వహక పదవి , ప్రతిపక్ష పదవి బీసీ లకు ,ఎస్సి లకు ఒక్కోటి ఇస్తే మీకు బీసీ ల గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది. మీ పార్టీలో బీసీ లకు ఎక్కడ న్యాయం ఉంది. రేవంత్ రెడ్డి  నాయకత్వంలో జరుగుతున్న ఈ కుల సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ వస్తుంది. కుల సర్వే ఇష్టం లేని బీజేపీ ,తెలంగాణలో బీసీ లకు అన్యాయం చేయాలని చూస్తున్న బిఆరెస్ కలిసి సర్వే పై అక్కడక్కడ అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని అన్నారు.
జీవో నెంబర్ 18 ద్వారా యావత్ తెలంగాణలో సమాచారం సేకరించి అసమానతలు తొలగించి అన్ని రకాలుగా న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ప్రజలు సహకరించాలి బ్యాంకు లో డిటైల్స్ అడగడం లేదు. ఆప్షనల్ గా ఆధార్ అడుగుతున్నారు..ప్రజల స్థితిగతులు తెలవడానికి. ప్రభుత్వం సమాచారం సేకరిస్తుంది.. ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. సమాచార సేకరణ కు వస్తున్న ఎన్యుమరేటెర్స్ కి సమాచారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితం కావద్దని కోరుతున్నా. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన మీ ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చింది… భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు పోతున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్