ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహజన్

- Advertisement -

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహజన్

SP Akhil Mahajan inspected the grain buying centers

రాజన్న సిరిసిల్ల
ఎల్లారెడ్డిపేట్ గంభీరావుపేట మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు.  ఎల్లారెడ్డిపేట్ మండలం వెంకటాపుర్ గంభీరావుపేట మండలం సముద్రాల లింగపూర్, గోరంటల గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి విధుల్లో ఉన్న అధికారులను కొనుగోలు ప్రక్రియను గురించి అడిగి తెలుసుకున్నారు. తరువాత  కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతుల సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులుదృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని మాయమాటలు చెప్పే దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular