- Advertisement -
రైతులకు చేరువలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
Establishment of rice grain purchase centers near farmers
-ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని
రైతుల శ్రేయస్సు దృష్ట్యా గ్రామగ్రామానికో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీరాంనగర్ కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ పెండ్లి రమాసురేష్ రెడ్డి, పుట్టపాక, బిట్టుపల్లి కేంద్రాలను డైరెక్టర్ కొత్త శ్రీనివాస్, నగరంపల్లి కేంద్రాన్ని డైరెక్టర్ ఉడుత మాధవి-పర్వతాల్ యాదవ్, సూరయ్యపల్లి, కాకర్లపల్లి, మహాబూబ్ పల్లి, గద్దలపల్లి, గోపాల్ పూర్ కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు లేక రైతులు నానా అవస్థలు పడేవారని, సుదూర ప్రాంతంలో గల కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ధాన్యం అమ్ముకోవాలంటే రైతులకు రవాణా చార్జీలు తడిసి మోపెడు కావడంతో పాటు తమ విలువైన సమయం కొనుగోలు కేంద్రాల్లోనే గడిచేదని భావించిన ఆనాటి పౌర సరఫరాల శాఖ మాత్యులు, ప్రస్తుత ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరువతో ఆనాడే రైతులకు చేరువలో ప్రతి గ్రామంలో వరి ధాన్యం కేంద్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రైతులకు గింజ కటింగ్ లేకుండా మంత్రి శ్రీధర్ బాబు జిల్లా అధికారులకు ఆదేశాలివ్వడంతో పాటు రైస్ మిల్లర్లను నియంత్రిస్తున్నారని అన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కౌన్సిలర్ నక్క నాగేంద్ర, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, నాయకులు పేరవేన లింగయ్య, కుడుదుల వెంకన్న, ఆరెల్లి కిరణ్, రేపాక శ్రీనివాస్, చెరుకుతోట రమేష్, జంజర్ల గట్టయ్య, లక్ష్మణ్, మేదరవేన ఓదెలు, రేపాక శంకర్, కుమారస్వామి, అయిలి శ్రీనివాస్, చాట్లపల్లి సంతోష్, సవాయి గణేష్, కన్నూరి సుదర్శన్, రేపాక శ్రీకాంత్, ఎడ్ల శ్రావణ్, నల్లి రాజయ్య, మధు, పూదరి సర్వేష్, పోగుల మహేందర్, గువ్వల రాజమల్లు, కొప్పుల రాజయ్య, చంద్రు రాజమల్లు, దాసరి రాములు, మేడ రాజయ్య, పోరెడ్డి తిరుపతి రెడ్డి, దయ్యాల కొమురయ్య, తిరుపతి, నందం, సంఘ సెక్రటరి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -