ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు
Chandrababu broke the promises made in the election
గురజాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపణ
గురజాల,
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారని గురజాల వైసిపి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. వైసీపీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన మేరకు కరెంటు చార్జీల పెంపుదలకు నిరసనగా శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన గురజాలలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ వైసీపీ కార్యాలయం నుండి కరెంట్ ఆఫీస్ వరకు సాగింది. అనంతరం విద్యుత్ ఏఇ మస్తాన్వలికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ వచ్చిన ఆరు నెలలోనే ప్రభుత్వ పనితీరు బయట పడింది అన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచమని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారు అన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో సామాన్యుడు భరించలేని విధంగా కరెంట్ ఛార్జీలు పెంచారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కాసు మహేష్ రెడ్డి తో పాటు పిడుగురాళ్ల మాజీ జెడ్పిటిసి సభ్యులు వీరభద్రుని రామిరెడ్డి, వైసిపి పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎనుముల మురళీధర్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వరరావు, కుక్కమూడి అన్నారావు, కర్ర కోటేశ్వరరావు, చల్లా కాశి బాబు, మన్నెం ప్రసాద్, పద్మ, యశోద, దుర్గా, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరం, గురజాల మండలాలకు చెందిన వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.