Sunday, April 19, 2026

కరీంనగర్ కమీషనరేట్ కి 349 నూతన కానిస్టేబుళ్ల కేటాయింపు

- Advertisement -

కరీంనగర్ కమీషనరేట్ కి 349 నూతన కానిస్టేబుళ్ల కేటాయింపు

Allocation of 349 new constables to Karimnagar Commissionerate

విధుల్లో చేరిన నూతన కానిస్టేబుళ్లు

కరీంనగర్
ట్రైనింగ్ ప్రతిభ ఆధారంగా నూతన కానిస్టేబుళ్లను పలు పోలీసు స్టేషన్లకు కేటాయింపు.
విధుల్లో చేరే నూతన కానిస్టేబుళ్లకు  కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి బ్రీఫింగ్ నిర్వహించారు..
కరీంనగర్ కమిషనరేట్ కి నూతనంగా భర్తీ అయిన 349 మంది  సివిల్ కానిస్టేబుళ్లు  పురుషులు- 150 మంది మహిళలు – 86 కాగా ,  మరియు ఏ ఆర్  కానిస్టేబుళ్లు పురుషులు- 95 మంది మహిళలు – 18 మంది  కేటాయించ బడ్డారని కరీంనగర్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు. వారు విధుల్లో చేరేందుకు శనివారంనాడు కమిషనరేట్ లో హాజరయ్యారు. కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని ఉద్దేశించి పోలీస్ కమీషనర్ పలు కీలక సూచనలు చేసారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ట్రైనింగ్ లో నేర్చుకున్న అంశాలన్నీ  విధుల్లో చేరాక ఆచరించాలన్నారు. తెలియని విషయాలని సీనియర్ల ద్వారా నేర్చుకోవాలన్నారు. ఇప్పుడు నేర్చుకునే అంశాలే రాబోయే 30 సంవత్సరాల తమ సర్వీస్ లో ఉపయోగపడతాయని అన్నారు.  పోలీస్ ఉద్యోగం పోలీస్ యూనిఫామ్ ఎంత కష్టపడ్డారో, ధరించాక అంతే భాద్యతగా వ్యవహరించాలన్నారు. క్రమశిక్షణ తప్పనిసరి అని అన్నారు. నిజాయితీగా, నిస్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. ట్రైనింగ్ లో వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా నూతన కానిస్టేబుళ్లను పలు పోలీసు స్టేషన్లకు కేటాయించామని పోలీస్ కమీషనర్ తెలిపారు. శనివారం సాయంత్రంలోగా విధిగా కేటాయించబడిన పోలీస్ స్టేషన్లలో విధుల్లో చేరాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ, ఏ వో ముని రామయ్య, ఏసీపీ లు శ్రీనివాస్ , విజయకుమార్ ఆర్ ఐలు రజినీకాంత్, జానీమియా కుమారస్వామి, శ్రీధర్ రెడ్డి లు మినిస్టీరియల్ సూపెరింటెండెంట్లు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్