విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్

- Advertisement -

విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్

The Congress government is undermining the education sector

మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్

జగిత్యాల,
విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని
మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆరోపించారు.. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు లోని గురుకుల పాఠశాలను మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ,బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు .అక్కడున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి సౌకర్యాలు, సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. విద్యార్థులతో కలిసి పాఠశాల నుండి కలెక్టరేట్  ప్రజావాణి కార్యక్రమానికి నడుచుకుంటూ వెళ్లి పాఠశాలలో ఉన్న సమస్యలను కలెక్టర్ కి వివరించారు..కాగా సమస్యలపై కలెక్టర్ స్పందించి డిఈఓ తో మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా
మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ….
రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అత్యంత దయనీయం పరిస్థితిలో ఉన్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అరకొర నిధులు కల్పించిందన్నారు.కనీసం నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. .అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యావంతులై తెలంగాణ ఖ్యాతి ని లోకానికి చాటి చెప్పాలనే ధ్రుడ సంకల్పంతో కేసీఆర్ గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తే ,వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు.కాస్మోటిక్ చార్జీలు పెంచారంటూ రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులు,కానీ ఇక్కడ కనీసం సబ్బులు కూడా ఇవ్వలేదు అంటూ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో దావా  వసంత సురేష్ వెంట
పట్టణ ఉపాధ్యక్షుడు వోలెం మల్లేశం, చింత గంగాధర్, వెంకటేశ్వర్లు, గంగారెడ్డి, చిట్ల రమణ, ప్రణయ్, భగవాన్ ,మనోజ్ నాయకులు తదితరులు ఉన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular