- Advertisement -
2 నెలల అమెరికా టూర్ కు కేసీఆర్
KCR to America tour for 2 months
హైదరాబాద్, డిసెంబర్ 18, (వాయిస్ టుడే)
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ఏడాది నుంచి ఫామ్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీ మీటింగ్‌లు ఉన్నా.. ముఖ్యనేతలతో మాట్లాడాల్సిన అవసరమొచ్చినా.. తన ఫామ్‌హౌస్‌కే పిలిపించుకుంటున్నారు తప్పా.. ఫామ్‌హౌస్ గేట్ కూడా దాటడం లేదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి కేసీఆర్ విదేశీ టూర్‌కు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ తన లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అమెరికాకు వెళ్లనున్నారని తెలుస్తోంది.నిజానికి రాజకీయ నాయకులు తరచూ విదేశాల్లో పర్యటిస్తుంటారు. అందులోనూ అధికారంలో ఉంటే.. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సదస్సు, ఆ సదస్సు అనో.. లేక అక్కడి అభివృద్ధిని అధ్యయనం చేసేందుకనో చెప్పి విమానాలెక్కి విదేశాల్లో వాలిపోతారు. కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు పూర్తి భిన్నమనే చెప్పాలి.సుదీర్ఘ కాలం ఉద్యమకారుడిగా ఉన్నా.. సుమారు 35 ఏళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్నా.. కేసీఆర్ కేవలం రెండు సార్లు మాత్రమే ఫారిన్ టూర్‌కి వెళ్లారు. సీఎం హోదాలో ఓసారి సింగపూర్, మరోసారి చైనాకు వెళ్లారంతే.. అంతకుమించి కేసీఆర్ దేశం దాటింది లేదు. దేశంలోనే అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రిగా, పొలిటికల్ లీడర్‌గా కేసీఆర్ నిలిచారు.ఏడాది కాలంగా ఫామ్ హౌజ్ దాటని కేసీఆర్.. ఇప్పుడు ఉన్నట్లుండి అమెరికాకు ఎందుకు వెళ్తున్నారని రాజకీయవర్గాల్లో సామాన్యుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటు బీఆర్ఎస్ నేతలు సైతం తమ అధినేత అమెరికాకు ఎందుకు వెళ్తున్నారని ఆరా తీస్తున్నారట. అవసరమైతే ఆయనతో పాటు తాము కూడా వెళ్లేందుకు కొందరు ముఖ్యనేతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం.కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత.. అమెరికాలోనే ఉన్నత విద్యలు చదివారు. కేటీఆర్ కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం కూడా చేశారు. అయినా సరే.. కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా అమెరికా ఫ్లైట్ ఎక్కింది లేదు. ప్రస్తుతం కేటీఆర్ కుమారుడు హిమాన్షు అమెరికాలో చదువుకుంటున్నాడు. ఐనా కేసీఆర్ ఎన్నడూ అమెరికా వైపు చూడలేదు.అలాంటి ఇప్పుడు సడన్‌గా ఈ ట్రిప్ ఏంటని అందరి డౌట్.. ఐతే ఇటీవల హిమాన్షు ఇండియా వచ్చినప్పుడు తాత కేసీఆర్‌ను అమెరికా రమ్మని కోరారట.. ఇంకా కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్న కేసీఆర్ తన మనవడి కోరికకు ఓకే చెప్పారని ఇన్‌సైడ్ టాక్.. తాత కేసీఆర్ వస్తే అక్కడ ఏయే ప్రదేశాలను చూడాలి, ఎక్కడెక్కడ పర్యటించాలనే టూర్ షెడ్యూల్ కూడా హిమాన్షు రెడీ చేశాడనేది టాక్..మరోవైపు అమెరికా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం సైతం కేసీఆర్‌ను అమెరికాకు అహ్వానించింది. ఈ మధ్యే ఫోరం చైర్మన్ లక్ష్మణ్‌తో కూడిన 15 మంది సభ్యుల బృందం ఎర్రవెల్లిలో కేసీఆర్‌ను కలిసి అమెరికాకు రావాలని కోరింది. దీంతో అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలను కూడా కలవాలని కేసీఆర్ చాలా కాలంగా అనుకుంటున్నారట.అందుకే మనవడితో కొన్ని రోజులు ఉండటంతో పాటు అమెరికాలోని ఎన్నారైలతోనూ సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగా అక్కడున్న ఎన్నారైలతో పార్టీ వ్యవహారాలు, సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.మొత్తం రెండు నెలల పాటు కేసీఆర్ అమెరికా పర్యటన ఉండేలా షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే ఏడాది కాలంగా కేవలం ఫామ్‌హౌస్ కే పరిమితమైన కేసీఆర్.. ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్తే అధికార కాంగ్రెస్ సహా బీజేపీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి మరి.
- Advertisement -