- Advertisement -
సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ
Meeting of film celebrities with CM Revanth
హైదరాబాద్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు.
అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేశ్, సి.కల్యాణ్, నాగవంశీ, గోపీ ఆచంట, బీవీఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, నవీన్, రవిశంకర్, త్రివిక్రమ్, మురళీ మోహన్, హరీశ్ శంకర్, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేశ్, బోయపాటి శ్రీను, కిరణ్ అబ్బవరం తదితరులు ఉన్నారు.భేటీలో సీఎం రేవంత్ సినిమా వాళ్లకు సినిమా చూపించారు. సంధ్యా టాకీస్ ఘటనపై పోలీసులు రిలీజ్ చేసిన వీడియోను ప్రదర్శించారని సమాచారం.
- Advertisement -