ఆ ఇద్దరిపై ఎక్స్ట్రడిషన్ అస్త్రం

- Advertisement -

ఆ ఇద్దరిపై ఎక్స్ట్రడిషన్ అస్త్రం

Both of them are extradited

హైదరాబాద్
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు, తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్రావుతోపాటు మరో ముఖ్య నిందితుడు అరువుల శ్రవణ్రావును పట్టుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఎక్స్ట్రడిషన్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దర్నీ అప్పగించాలంటూ ఆ దేశానికి సమాచారమిచ్చే ప్రక్రియను ప్రారంభించారు. కరడుగట్టిన నేరస్థులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్కు ఒప్పందం ఉన్న నేపథ్యంలో తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సీఐడీ ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకుంటే నిందితులిద్దరిని భారత్కు అప్పగించే అవకాశముంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular