ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపాలి
Vehicles should be driven following traffic rules
నేరాల నియంత్రనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
బుగ్గారం ఎస్ఐ మాడ శ్రీధర్ రెడ్డి
జగిత్యాల, జ
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపాలని, హెల్మెట్ తప్పనిసరి ధరించి ప్రాణాలు రక్షించుకోవచ్చని బుగ్గారం సబ్ ఇన్స్పెక్టర్ మాడ శ్రీధర్ రెడ్డి అన్నారు.
త్రిబుల్ రైడ్, మద్యం తాగి, సెలఫోన్ మాట్లాడుతూ
డ్రైవింగ్ చేయకూడదని సూచించారు.
రోడ్డు భద్రతా మాసం సందర్భంగా మంగళవారం ఎస్సై శ్రీధర్ రెడ్డి బుగ్గారం మండలంలోని చందయ్యాపల్లెలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించి ప్రజలకు అవగాహనా
కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరాలు నియంత్రించవచ్చని తెలిపారు.
గ్రామాల్లో దొంగతనాలు, మరే ఇతర నేరాలు జరిగిన సీసీ
కెమెరాల ఏర్పాటుతో వాటిలో నిక్షిప్తమైన ఆధారాలతో వ్యక్తులను గుర్తించి పట్టుకోవచ్చని ఎస్సై తెలిపారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని పేరెంట్స్ కు సూచించారు.
మైనర్లు వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగినట్లయితే
పేరెంట్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
వాహనాధారులు
ట్రాఫిక్ నిబంధనలు పాటించి డ్రైవింగ్ చేయాలనీ ఎస్సై శ్రీధర్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎన్నం కిషన్ రెడ్డి, రాచెర్ల మల్లయ్య,
మ్యాకల భీమేష్, బియ్యల మల్లయ్య, లక్ష్మారెడ్డి,వెంకటేష్,కొండ్ర లక్ష్మణ్,కొమురయ్య,
చల్ల తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.



