- Advertisement -
కేసీఆర్, కేటీఆర్ లకు ఈనో ప్యాకెట్లు..
Eno packets for KCR and KTR..
హైదరాబాద్ వ్యాప్తంగా బ్యానర్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు
హైదరాబాద్
దావోస్ పర్యటనలో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి సీఎం రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వలో, కాంగ్రెస్ పరిపాలనలో భారీ పెట్టుబడులను, తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ నేతల ఆరోపణ
ఈ నేపధ్యంలో కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ, హైదరాబాద్ లో భారీగా హోర్డింగ్ లు ఏర్పాటు చేసారు. పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ఈనో ..! పేరుతో హోర్డింగ్ లు ఏర్పాటు చేసారు. కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు, ఈనో ప్యాకెట్ తో హైదరాబాద్ లో బ్యానర్లు సంచనలంగా మారాయి. డైజెస్టు ద గ్రోత్ పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రజలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
- Advertisement -



