దేశ నిర్మాణంలో ఓటు ముఖ్యమైనది..డిప్యూటీ తాసిల్దార్ ముజీబ్…

- Advertisement -

దేశ నిర్మాణంలో ఓటు ముఖ్యమైనది..డిప్యూటీ తాసిల్దార్ ముజీబ్…

Vote is important in nation building..Deputy Tahsildar Mujeeb...

డుంబ్రిగుడ
దేశ నిర్మాణంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమైనదని మండల డిప్యూటీ తాసిల్దార్ ముజీబ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు 15వ ఓటు హక్కు దినోత్సవాన్ని పురస్కరించుకొని తాసిల్దార్ కార్యాలయం నుండి ప్రధాన మూడు రోడ్ల కూడలి వద్ద ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ ముజీబ్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే దేశం గొప్పతనం గురించి, ప్రజాస్వామ్యం గురించి విద్యార్థులకు బోధిస్తే వారికి ఓటు విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. మనిషి జీవనానికి స్వేచ్ఛ అవసరమని, ప్రజాస్వామ్యం నుండే ఆ స్వేచ్ఛ లభిస్తుందని, అప్పుడే పిల్లలకు ఓటు విలువ తెలుస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యమని, దేశభక్తి ఉంటే ఓటు విలువ తెలుస్తుందని చెప్పారు. గతంలో ఎంతోమంది పోరాటం చేయడం వల్లనే స్వాతంత్ర్యం వచ్చిందని, అప్పటి దేశభక్తి ప్రస్తుత తరంలో కనబడటం లేదన్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఓటు ప్రతి ఒక్కరి కంట ధ్వని గా పేర్కొన్నారు. ఓటు వేయడానికి ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని, 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా చేరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular