బిఅర్ఎస్  తిరిగి అధికారంలోకి రావాడం ఖాయం

- Advertisement -

బిఅర్ఎస్  తిరిగి అధికారంలోకి రావాడం ఖాయం

BRS is sure to come back to power

పార్టీ కార్యకర్తలకు చిన్న చీమంత హాని జరిగినా, చిరుతనై వస్తా.

స్థానిక ఎన్నికలలో సత్తాచాటాలి.

ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం.

అనంతగిరి మండల బిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట జిల్లా, జనవరి 27: బిఅర్ఎస్  తిరిగి అధికారంలోకి రావాడం ఖాయం అని కోదాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్  మాజీ శాసన సభ్యులు బొల్లం  మల్లయ్య యాదవ్  అన్నారు. సోమవారం అనంతగిరి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్  హాజరై  ఈ సందర్భంగా మాట్లాడుతూ,పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా అని అన్నారు.స్థానిక ఎన్నికలలో సత్తాచాటాలి అని పిలుపునిచ్చారు.ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయింది అని తెలిపారు. సంవత్సరం  కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి వచ్చింది  అన్నారు. బడికి పోయే పిల్లల నుండి పింఛన్లు అందుకునే అవ్వా ,తాతల దాకా రోడ్లు ఎక్కారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డిదే అని తెలిపారు.కేసీఆర్  బతుకమ్మ పండుగ వేల చీరెలు ఇచ్చిండు, కేసీఆర్ కిట్లు, న్యూట్రీషన్ కిట్లు ఇచ్చిండు, చెరువుల్లో చేపలు వేసిండు. గొర్రెలు ఇచ్చిండు
కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నీ పోయాయి అని అన్నారు. నేడు 10వేలు, రేపయితే 15వేల రైతు భరోసా అన్నారు.మహిళలకు 2500 అన్నడు. ప్రతి మహిళకు 25వేల బాకీ పడ్డడు అని తెలిపారు.బతుకమ్మ చీరెలు అన్నడు, 500 ఇస్తడు అన్నడు ఎగ్గొట్టిండు అని అన్నారు వృద్ధులకు 4వేల పింఛన్ ఇస్తా అని మాట తప్పిండు,
ఇచ్చే రెండు వేల పింఛన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు అని గుర్తు చేశారు.పింఛన్లు దగా
రైతులకు బోనస్ దగా,రుణమాపీ దగా,తులం బంగారం దగా,విద్యార్థులకు జాబ్స్ దగా,మహిళలకు 2500 దగా,
అన్నీ దగా ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రెడ్డి
చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ మ్యాన్
అన్ని పంటలకు బోనస్ అని మోసం చేసిండు అని ఆయన తెలిపారు.ఓట్ల ముందు డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ అన్నడు,
పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆగస్టు 15నాటికి పూర్తి చేస్తా అన్నడు అని గుర్తు చేశారు.దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు.రుణమాఫీ డిసెంబర్ 9, 2024 వరకు చేస్తానని ఇప్పుడు అంటున్నారు, అది కూడా 3లక్షల మందికే అట ఈ రుణమాఫీ పైసలన్నా పడ్డయి అంటే బీఆర్ఎస్ పార్టీ నిలదీయడం వల్లనే అని ఆయన గుర్తు చేశారు.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అనేది పెద్ద మోసం
నిరుద్యోగ యువత పై అరాచకం చేస్తున్నారు.ఆరు గ్యారెంటీల బాధ్యత నాది అని చెప్పిన సోనియా గాంధీ ఎక్కడున్నారు. అధికారం వచ్చాక పత్తా లేకుండా పోయారు.కాంగ్రెస్ వికృత వైఖరి పట్ల గ్రామ గ్రామాన చర్చలు పెట్టాలి. ప్రజలు, రైతులు, యువత అందరికీ అర్థమయ్యేలా వివరించాలి అని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నల్ల భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గులోత్ శ్రీనివాస్ నాయక్, మాజీ సొసైటీ చైర్మన్ ఉషారాణి హనుమంతరావు,  పార్టీ నాయకులు  మట్టపల్లి పుల్లయ్య గౌడ్, పూర్ణచందర్, అఫ్జల్, బిక్షం, మట్టపల్లి సైదులు, అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు, సింగల్ వింటర్ డైరెక్టర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular