- Advertisement -
రామగుండం ఎన్టీపిసి విస్తరణ ప్రజాభిపాయ సేకరణ
Ramgundam NTPC Expansion Referendum
బిఆర్ఎస్ ఆందోళన
ముందస్తుగా పలువురిని అరెస్టు చేసిన పోలీసులు
అరెస్టులపై మాజీ ఎమ్మెల్యే చందర్ ఆగ్రహం
రామగుండం
పెద్దపల్లి జిల్లా రామగుండంలో తెలంగాణ థర్మల్ ప్రాజెక్టు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణపై బిఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరు కావాలని ఆహ్వానించి ముందస్తుగా అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే కొరుకంంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీపిసిలో 2400 మెగావాట్ల తెలంగాణ థర్మల్ ప్రాజెక్టు ఫేజ్ 2 లో 6900 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు ఎన్టీపిసి ప్రభావిత గ్రామాల ప్రజలను రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. అయితే బిఆర్ఎస్ నాయకులు ఆందోళన చేసే అవకాశం ఉందని భావించి ముందస్తుగా అరెస్టు చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టులపై రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2400 మెగావట్ల ఫేజ్-2 ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతుకలను పోలీస్ స్టేషన్ లో నిర్భందించారన్నారు. పోలీసు బలగాలతో అణిచివేత ధోరణిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారని విమర్శించారు. సభా ప్రాంగణానికి అసలైన నిర్వాసితులను అనుమతించడం లేదని… తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అసహన వ్యక్తం చేశారు. ప్రభావిత ప్రాంత ప్రజలతో కాకుండా అనామకులతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని భూ నిర్వాసితులకు, కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని చందర్ హెచ్చరించారు.
- Advertisement -



