- Advertisement -
కరెంటు షార్టెజ్ వల్ల నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధం
House caught fire due to power shortage
చాగలమర్రి
కొత్త ఎస్సీ కాలనీ నందు మద్దూరు అంకాలమ్మ కు చెందిన ఇండ్లు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు కరెంటు షార్టెజ్ వల్ల ప్రమాదవశాత్తు ఇండ్లు నిప్పు అంటుకొని
ఇండ్లు మొత్తం దగ్ధం కావడం జరిగింది. విద్యుత్ అధికారులు వచ్చి కరెంటు కనెక్షన్ తొలగించినా కూడా ఫలితం లేకపోయింది. కుటుంబంలో నివసించేవారు ఏ రోజుకు ఆ రోజు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. ఇల్లు దగ్ధం కావడం వల్ల 50,000/- రూపాయల మేరకు నష్టం జరిగింది అని , ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించి ఇంటిని పునః నిర్మించుకోవడానికి సహాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
- Advertisement -



