సీఎం రేవంత్ ను కలిసిన దేశ్ పాండే ఫౌండేషన్

- Advertisement -

సీఎం రేవంత్ ను కలిసిన దేశ్ పాండే ఫౌండేషన్

Desh Pandey Foundation who met CM Revanth

హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ్ పాండే ఫౌండేషన్ సభ్యులు శుక్రవారం కలిసారు. ఫౌండేషన్ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పు కోసం పని చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఆంగ్లంలో శిక్షణ ఇస్తుంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి పనిచేస్తుంది.  రాష్ట్రంలో తమ కార్యక్రమాల విస్తరణ కు ప్రభుత్వ సహకారం కోరింది.  సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కస్తుర్భా బాలికల పాఠశాల్లో పని చేయాలని సూచించారు. మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ను  దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు ఫౌండేషన్  అంగీకరించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు ,సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు గురురాజ్ దేశ్ పాండే ,జయ శ్రీ దేశ్ పాండే,రాజు రెడ్డి, జీ.అనిల్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular