మల్లన్న తిరుగుబాటేనా…
Is it Mallanna rebellion?
10 మంది ఎమ్మెల్యేల సంగతి ఏంటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 7, (వాయిస్ టుడే)
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా సాగుతున్న రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ తీన్మార్ మల్లన్నగా మారిపోయాయి. ప్రభుత్వం చేపట్టిన సర్వేను.. బీసీల జనాభా లెక్కలను తప్పు
పట్టిన తీన్మార్ మల్లన్న.. ఓ బహిరంగ సభలో ప్రభుత్వం చేపట్టిన గణనను ఉ* పోసి తగలబెట్టాలని పిలుపునిచ్చాడు.కేవలం ఈ వ్యాఖ్యలు మాత్రమే కాకుండా.. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న
వ్యాఖ్యలు చేశాడు. ఇవి కాస్త రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. చివరికి మాజీ మంత్రి కేటీఆర్ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్రస్తావించేదాకా వెళ్ళింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం
చేసుకోవచ్చు. కేటీఆర్ అలా మాట్లాడిన తర్వాత కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం లేకుండా పోయింది. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో తీన్మార్ మల్లన్న వ్యవహారం శైలి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని నాయకులు అంతర్గత చర్చల్లో పేర్కొంటున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు
ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వ్యవహార శైలి మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ లేదా డిస్మిస్ చేయాల్సి వస్తుందని హెచ్చరించిందని సమాచారం. అయితే దీనిపై తీన్మార్ మల్లన్న కూడా అదే స్థాయిలో
స్పందించారని.. ఘాటు వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన యూట్యూబ్ ఛానల్ లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్టు చర్చ జరుగుతుంది. ”
నాకు నోటీసులు ఇవ్వడానికి మీరు ఎవరు?, కాంగ్రెస్ పార్టీ ఏమైనా మీ జాగీరా?, కాంగ్రెస్ పార్టీ అనేది మాది. నన్ను బెదిరించాలని చూస్తే నడవదు. నాకు అన్యాయం చేయాలని చూస్తే పండబెట్టి తొక్కుతా.. కొంతమంది
ఎమ్మెల్యేలు కుల గణన సర్వే బాగోలేదని చెప్పకుండా.. పారదర్శకంగా ఉందని ముఖ్యమంత్రికి భజన చేస్తున్నారు. ఇది సమగ్ర కుల సర్వే కాదు.. అగ్రకుల సర్వే అని” తీన్మార్ మల్లన్న మండిపడ్డారని
తెలుస్తోంది.తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుముఖంగా లేరని తెలుస్తోంది.. అంతర్గతంగా తీన్మార్ మల్లన్న పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మరో వైపు
కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీన్మార్ మల్లన్న వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ఆయన నోరును అదుపులో పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని.. లేకపోతే పార్టీకి
మరింత డ్యామేజ్ జరుగుతోందని వారు అధిష్టానం ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది. ” కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ
ఆయన మాత్రం వ్యక్తిగత లాభం కోసం పనిచేస్తున్నారు. మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆయన నోటిని అదుపులో
పెట్టుకునే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలి. లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని” కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిష్టానం ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది. మరి తీన్మార్ మల్లన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ
ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఆ 10 మంది సంగతి ఏంటీ
కాంగ్రెస్ అంటేనే కయ్యాల పార్టీ. ఎక్కడా ప్రశాంతంగా ఉండదు. గొడవలు, వర్గపోరు.. ఎవరికి వారు మాట్లాడడం ఆ పార్టీలో చాలా కామన్. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అలకలు, ఆధిపత్య
పోరు మధ్య 14 నెలల పాలన పూర్తి చేసుకుంది. బొటాబొటి మెజారిటీ ఉన్న రేవంత్ సర్కార్ బలం పెంచుకునేందుకు 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. కానీ, వారు కూడా ప్రభుత్వంతో అంటీ
ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా పది మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఒక మంత్రికి వ్యతిరేకంగా జడ్చర్లలోని ఒక
ఫాంహౌస్‌లో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. సుమారు గంటపాటు మత్రి తీరుపై చర్చించారని సమాచారం. మరోమారు కూడా సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.రహస్య భేటీకి ముందు రోజు పది
మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కూడా కలిసినట్లు సమాచారం. మంత్రి తమను పట్టించుకోవడం లేదని వారు సీఎంకు ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే సీఎం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేలు
రహస్యంగా భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. మరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో పాల్గొన ఎమ్మెల్యేలు ఎవరు.. ఏ మంత్రికి
వ్యతిరేకంగా వారు సమావేశం అయ్యారు అన్నది మాత్రం తెలియడం లేదు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కుమ్ములాట మొదలైంది. బహిరంగ విమర్శలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం
వంటివి కొనసాగాయి. వాటినీ సీఎం చక్కదిద్దారు. ఇప్పుడు 14 నెలల తర్వాత మరోమారు అధికార పార్టీలో లుకలుకలు బయట పడ్డాయి. రహస్యంగా ఎమ్మెల్యేలు భేటీ కావడం చర్చనీయాంశమైంది.కాంగ్రెస్
అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా మంత్రివర్గ విస్తరణ జరుగలేదు. రేపు మాపు అంటూనే కాలం వెల్లదీస్తున్నారు. దీంతో పదవులు ఆశిస్తున్న చాలా మంది సర్కార్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. నామినేటెడ్
పదవులు కూడా చాలా వరకు కాళీగా ఉన్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా పెద్దగా కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది
అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్ అంశంపై పార్టీలోని మాల, మాదిగ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పొడచూపాయి. వివేక్ వెంకటస్వామి, సంపత్ మధ్య బహిరంగంగానే మాటల యద్ధం
జరుగుతోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేస్తాయో అన్న టెన్షన్ క్యాడర్‌లో కనిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ ప్రకటన చేసిన రెండు రోజులకే అసమ్మతి సమావేవం వెలుగులోకి రావడంతో కేసీఆర్ కాంగ్రెస్‌ను
గట్టిగా కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్న చర్చ మొదలైంది.



