Wednesday, March 11, 2026

కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్ :కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

- Advertisement -

కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్

సీఎం వ్యాఖ్యలే నిదర్శనం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

Congress Khel Khatam Shop Bandh: Union Minister Sanjay Kumar

రాజన్న సిరిసిల్ల

ఇగ రైతుల హామీలన్నీ గాలికొదిలేసినట్లే
వ్రుద్దులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు
మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఒట్టిమాటేనని తేలింది.
నిరుద్యోగులకు రూ.4 వేల భ్రుతి ఇగ రాదు
విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇగ ఇయ్యరని తేల్చేశారు,
మోసాల కాంగ్రెస్ ను వదిలి పెట్టబోం
నేటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం
సంవిధాన్  చేత పట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలేమైనయ్
రాహుల్ సమాధానం చెప్పి తీరాల్సిందే,
రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ వన్నీ ఝూటా మాటలే
నాగుపాములెక్క వంకర టింకరగా రోడ్డును నిర్మించింది కాంగ్రెస్సే,
కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం పనులు చేయించింది కాంగ్రెస్సే
2035 వరకు కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ చేయించుకున్నది కాంగ్రెస్సే,
ఆ కాంట్రాక్ట్ తో ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్రం చెప్పింది నిజం కాదా?
ఆ సమస్యను పరిష్కరిస్తే 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరిస్తామని 2022లోనే చెప్పలేదా,
ఇదిగో ఆధారం:
సోమవారం కోమటిరెడ్డికి కూడా గడ్కరీ ఇదే విషయాన్ని చెప్పారు
అయినా లేఖల పేరుతో కేంద్రంపై బురద చల్లడం ఎంత వరకు కరెక్ట్?
ప్రజల ద్రుష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ డ్రామాలాడుతున్నారు.
సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించాల్సిందే
ఎల్లారెడ్డిపేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్:
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు కూడా పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోతారేమనని దొంగలాగా చూస్తూ అపాయిట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇగ అమలు చేయలేనని సీఎం తేల్చేశారు. ఇక వ్రుద్దులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు. మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఒట్టిమాటేనని తేలింది. నిరుద్యోగులకు రూ.4 వేల భ్రుతి ఇయ్యనట్లే. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇయ్యరని తేల్చేసినట్లే. రైతులకిచ్చిన హామీలను గాలికొదిలేసినట్లే అని వ్యాఖ్యానించారు.
ఇగ తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అయినట్లేనని అన్నారు. సంవిధాన్ పుస్తకం పట్టుకుని తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడెం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుందన్నారు. ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి నేటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామని చెప్పారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ప్రెస్ క్లబ్ ను సందర్శించారు. స్థానిక విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు ఏమన్నారంటే:
తెలంగాణ రాష్ట్రమనే కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాతో ఏం కాదు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా. రాష్ట్రం దివాళా తీసింది. అని మాట్లాడటం సిగ్గు చేటు. ఇప్పటికే కాంగ్రెస్ పట్ల ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నరు. సోమవారం సీఎం మాటలతో కాంగ్రెస్ పనైపోయింది. ఖేల్ ఖతం దుకాణ్ బంద్
సీఎం వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మా భవిష్యత్తు ఏమిటనే భయంతో ఉన్నరు. ఇంటికి ఏదైనా సమస్య వస్తే ఇంటి పెద్ద కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ సమస్యను అధిగమించేందుకు యత్నిస్తరు. కానీ రాష్ట్రానికి పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీసిండు. దేశం ముందు తలదించుకునేలా చేసిండు. యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం సోమవారం పూర్తిగా మంట కలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇంతకంటే అవమానం మరొకటి లేనేలేదు.
ఢిల్లీకి పోతే అపాయిట్ మెంట్ కూడా ఇస్తలేరని చెప్పడం పచ్చి అబద్దం. ప్రధానమంత్రిని చాలా సార్లు కలిశారు. కేంద్ర మంత్రులను ఎప్పుడంటే అప్పుడు కలుస్తూనే ఉన్నడు. అయినా  ఏం మాట్లాడుతున్నరు. వీడొస్తే చెప్పులు కూడా ఎత్తుకు పోతరేమోననే భయంతో దగ్గరికి కూడా రానీయడం లేదు. అని అంటున్నడు. ఈ చెప్పులెత్తక పోవడమేంది ఈ చెప్పులెత్తక పోవడమేంది? నాకైతే అర్ధం కాలే. కాంగ్రెస్ లో అట్లనే చేస్తరేమో. ఆ పార్టీ సంస్క్రుతి అదేనేమో. 2023 డిసెంబర్ లో, 2024 జులైలో, 2025 ఫిబ్రవరిలో కూడా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కేంద్ర మంత్రులైతే లెక్కేలేదు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్