Friday, March 13, 2026

దాడులు ఎక్కడ జరిగాయంటే…

- Advertisement -

దాడులు ఎక్కడ జరిగాయంటే…
లాహోర్, మే 7, (వాయిస్ టుడే)

Where did the attacks take place?

ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రస్థావరాలే టార్గెట్‌గా ఇండియన్‌ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయ్‌. పాకిస్తాన్‌లో 4.. పీవోకేలో 5 చోట్ల ఎటాక్స్‌ కొనసాగుతున్నాయ్‌. ఇందులో ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయూద్ కంచుకోట మురిడ్కే కూడా ఉంది. ముజఫరాబాద్‌లోని 2 ప్రాంతాలు, కోట్లీ, గుల్పూర్, భీంబర్, సియాల్‌కోట్, చక్రంబూ, మురిడ్కే, బహ్వల్పూర్‌లోని టార్గెట్స్‌ను ఆర్మీ చేధించింది. జైషే మహ్మద్, లష్కరే ఉగ్రసంస్థల టాప్ లీడర్స్ లక్ష్యంగా ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది ఇండియన్ ఆర్మీ.
ఇండియన్‌ ఆర్మీ ఎక్కడెక్కడ దాడి చేసిందంటే..
— మురిడ్కే.. ఇక్కడే లష్కరే తోయిబా హెడ్‌ క్వార్టర్‌ ఉంది.. దాంతో, మిస్సైళ్లతో విరుచుకుపడింది భారత్‌
— బహావల్‌పూర్‌.. ఇక్కడ జైష్-ఎ-మహమ్మద్ హెడ్‌ క్వార్టర్‌ ఉంది.. ఈ ప్రాంతంపై కూడా బాంబుల వర్షం కురిపించింది ఇండియన్‌ ఆర్మీ
— ముజఫరాబాద్.. పీవోకేకి హెడ్‌క్వార్టర్‌ ఇది.. ఇక్కడే హిజ్బుల్ ముజాహిదీన్‌ బెస్‌ ఉంది.. ముజఫరాబాద్‌లో రెండు ప్రాంతాలను టార్గెట్‌ చేసింది భారత్‌
— కోట్లీ.. ఇక్కడున్న టెర్రర్‌ క్యాంప్స్‌పై బాంబుల వర్షం కురిపించింది ఇండియన్‌ ఆర్మీ
— ముజఫరాబాద్‌లో మరోచోట మిస్సైళ్లతో దాడి చేసింది భారత్‌
— గుల్‌పూర్… ఇక్కడున్న టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్‌పై దాడులు చేసింది భారత్‌
— సియాల్‌కోట్‌.. ఇక్కడ టెర్రర్‌ క్యాంప్‌పై మిస్సైళ్ల వర్షం కురిపించింది
— చాక్‌అమ్రూ.. ఇక్కడ టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్‌పై భారత సైన్యం దాడులు చేసింది
— ఇక పీవోకేలో 5 ప్రాంతాల్లో ఎటాక్స్‌ చేసింది
— భీంబర్‌.. ఇక్కడ కూడా టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్‌పై దాడులు చేసింది ఇండియన్‌ ఆర్మీ
ఇప్పటివరకు 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది ఇండియన్‌ ఆర్మీ. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్‌లో మిస్సైళ్ల వర్షం కురిపించింది.
— బహావల్‌పూర్‌లో 100 కిలోమీటర్ల దూరం వరకు
— మురిడ్కేలో 30 కిలోమీటర్ల లోపలివరకు
— గుల్‌పూర్‌లో 35 కిలోమీటర్ల లోపలివరకు
— సవాయి‌లో 30 కిలోమీటర్ల లోపలివరకు
— బిలాల్‌లో 25 కిలోమీటర్ల లోపలివరకు
— కోట్లీలో 15 కిలోమీటర్ల లోపలివరకు
— బర్నాలలో 10 కిలోమీటర్ల లోపలివరకు
— సర్జల్‌లో 8 కిలోమీటర్ల లోపలివరకు
— మెహ్‌మూనాలో 15 కిలోమీటర్ల దూరం వరకు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్