Friday, March 20, 2026

గాంధీ మార్గంలో నడిచినందుకే మన దేశానికి ఈ గతి పట్టింది- పవన్ కల్యాణ్

- Advertisement -

గాంధీ మార్గంలో నడిచినందుకే మన దేశానికి ఈ గతి పట్టింది- పవన్ కల్యాణ్
హైదరాబాద్ మే 7 (వాయిస్ టుడే)

Our country has suffered this fate because it followed Gandhi's path - Pawan Kalyan

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ చూపిన శాంతి, అహింస మార్గంలో నడుస్తూ, శాంతి మంత్రం జపించినందుకే భారత్‌కు ఈరోజు ఈ గతి పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నుంచి కాశ్మీర్ పండిట్లను చంపడం నుంచి వారి అరాచకాలు పెరిగాయి. అంత్యక్రియలు చేయడానికి తీసుకెళ్తే.. అక్కడ సైతం మారణహోమం చేసి హిందువులను చంపేశారని పేర్కొన్నారు. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో లో ఏపీకి చెందిన ఇద్దరు చనిపోయారు. చంపే ముందు వారిని మీరు హిందువులా కాదా అని అడిగి మారణహోమం చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. పాక్ ఉగ్రవాదులపై భారత ఆర్మీ చేపట్టిన చర్యలు ఇంకా కొనసాగుతాయన్నారు.హైదరాబాద్‌లో బాంబు దాడులు జరిగినా దాని మూలాలు పాకిస్తాన్ లో  ఉంటున్నాయి. కశ్మీర్ లోనే కాదు దేశంలో ప్రతిచోట జరిగే ఉగ్రదాడులకు పాక్ టెర్రరిస్ట్ సంస్థలే కారణం. ఇలాంటి దాడులు సహించలేక మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత సైన్యం చేపట్టే ప్రతి చర్యకు దేశం మొత్తం మద్దతు తెలుపుతుంది. దేశంలో ఏదైనా వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా వారిపై ఫిర్యాదు చేయండి. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లం అంటూ దేశ భద్రతకు, జాతీయ సమగ్రతకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాలో కుక్కల్లా ఏది పడితే అది మొరగకూడదని హెచ్చరిస్తున్నాం. భారత ఆర్మీకి, ఉగ్రవాదులపై పోరాటానికి చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై పిచ్చి కూతలు కూసినా, ఏది పడితే అది మొరిగినా చర్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు మద్దతుగా కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. నేను వారిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడాను . అందరు కాంగ్రెస్ నేతల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. మతం ఆదారంగా ఎలాంటి వివక్ష ఉండకూడదు, దాడులు జరగడం దారుణమన్నారు. సెలబ్రిటీలు దేశాన్ని నడపటం లేదు. కేవలం ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు, నేతలు మాత్రమే పరిపాలన చేస్తున్నారు. సోషల్ మీడియాలో చేసే కామెంట్లతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనుకోవడం సరికాదు.నాన్ లోకల్ వాళ్లు ఎక్కువ ఉద్యోగాలు సాధిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది. వేరే ప్రాంతాల వారు ఇక్కడికి వస్తే వారికి అవకాశాలు లభిస్తే.. స్థానికులు నష్టపోతారు. అదే విధంగా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు మన దేశంలోకి రావడం మరో పెద్ద సమస్యగా మారుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటికి సరైన రీతిలో పరిష్కారం చూపిస్తుందని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ బలగాలు భింబర్, మురిడ్కే, బహావల్‌పూర్, సియాల్‌కోట్, తెహ్రా కలాన్, కోట్లి, ముజఫరాబాద్‌లలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేశాయి. జేషే మహ్మద్, లష్కరే తోయిబాతో పాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ ట్రైనింగ్ క్యాంపులపై సైతం సైన్యం 25 నిమిషాల పాటు మెరుపు దాడి చేసి నాశనం చేసింది. నేడు మీడియాతో మాట్లాడుతూ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్