జై హింద్.. జై మోడీ
హైదరాబాద్ మే 7 (వాయిస్ టుడే)
Jai Hind.. Jai Modi
భారత్ భూభాగంలోకి చొరబడి ఘాతుకాలకు పాల్పడితే… తమ ప్రజల ప్రాణాలు హరిస్తే… చూస్తూ ఊరుకునేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధూర్’తో ప్రపంచానికి చాలా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడికి ధీటుగా బదులు ఇచ్చింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత భూ భాగంలోని తొమ్మిది తీవ్రవాద స్థావరాలపై దాడి చేసింది. దీనిపై సినిమా సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు. మోడీకి మద్దతుగా దేశానికి అండగా నిలబడతామంటూ ట్వీట్లు చేశారు. ‘ఆపరేషన్ సింధూర్’ మీద టాలీవుడ్ సెలబ్రిటీల రియాక్షన్స్ చూడండి.
యోధుడి యుద్ధం మొదలైంది – రజనీ
‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశారు. యోధుడి యుద్ధం మొదలైందని ఆయన పేర్కొన్నారు. లక్ష్యం పూర్తయ్య వరకు ఈ యుద్ధం ఆగదు అని రజని వివరించారు. ప్రధాని మోడీకి, హోం మంత్రిత్వ శాఖ వెంట దేశం మొత్తం నిలబడుతుందని ఆయన తెలిపారు.
జైహింద్… మెగాస్టార్ చిరంజీవి ట్వీట్!
‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత స్పందించిన తొలి టాలీవుడ్ సెలబ్రిటీ మెగాస్టార్ చిరంజీవి. జైహింద్ అంటూ సోషల్ మీడియాలో ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘ఆపరేషన్ సింధూర్’ ఫోటో యాడ్ చేశారు. ‘భారత్ మాతాకీ జై... జైహింద్’ అంటూ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూడా ట్వీట్ చేశారు.
ఇండియన్ ఆర్మీ సేఫ్టీగా ఉండాలి – ఎన్టీఆర్
‘ఆపరేషన్ సింధూర్’ పట్ల మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘జై హింద్’ అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. భారత ఆర్మీ సురక్షితంగా, శక్తివంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మనదేశ త్రివిధ దళాలకు మరింత శక్తివంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ధీటైన సమాధానం ఆపరేషన్ సింధూరం ద్వారా ఇచ్చారని తెలిపారు.
న్యాయం జరిగిందన్న బన్నీ…
సహించేది లేదన్న సాయి దుర్గా తేజ్!
‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా న్యాయం జరిగిందని అల్లు అర్జున్ ట్వీట్ చేయగా… అసలు సహించేది లేదని సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేశారు. ఇండియన్ ఆర్మీకి యువ హీరో సుధీర్ బాబు సెల్యూట్ చేశారు. దేశ సైనికుల ధైర్య సాహసాలను చెప్పేందుకు ‘ఆపరేషన్ సింధూర్’ ఒక ఉదాహరణ అన్నారు. భారత్ భూభాగం మీద తీవ్రవాదానికి చోటు లేదని ఆయన పేర్కొన్నారు. భారత గౌరవాన్ని మరింత నిలబెట్టిన సైనికులకు సెల్యూట్ చేయడంతో పాటు జైహింద్ అని పేర్కొన్నారు.



