ప్రధాని మోదీ.. దేశాన్ని అమెరికాకు అమ్మేశారు :రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ ఫిబ్రవరి 3
PM Modi has sold the country to America: Rahul Gandhi
ఆమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీ.. దేశాన్ని అమెరికాకు అమ్మేశారని రాహుల్ మండిపడ్డారు. అమెరికా ఒత్తిడితో ప్రధాని మోదీ వణికిపోయారని అన్నారు. నాలుగు నెలలుగా నిలిచిన ఒప్పందంపై మోదీ సంతకం చేశారని.. మోదీపై వచ్చిన తీవ్ర ఒత్తిడి వల్లే సంతకం చేశారని పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడితో ఒప్పందంపై మోదీ రాజీ పడ్డారని అన్నారు. ప్రజల కష్టార్జితాన్ని మోదీ అమెరికాకు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. ఆమెరికా బయటపెట్టని ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా విషయాలు ఉన్నాయని రాహుల్ అన్నారు. అమెరికాలో అదానీపై కేసు ఉందని.. వాస్తవానికి ఆ కేసు మోదీపై పెట్టాల్సిన కేసు అని పేర్కొన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో మోదీపై చాలా ఒత్తిడి ఉందన్నారు. ప్రధాని అమెరికాకు ఎందుకు లొంగిపోయారన్నది ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు.


