సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం
Make CPM and Congress candidates win
Minister Ponguleti Srinivas Reddy
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరింత భూస్థాపితం కావడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో ఉన్న దొరల పాలనను, గడీలను బద్దలు కొట్టి కాంగ్రెస్ ప్రజాపాలన తీసుకువచ్చాం. వరి వేస్తే ఉరే అన్న గత పాలకులకు బుద్ధి చెప్పేలా వరి పండించిన వారికి కూడా సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది అని అన్నారు.
రైతుల పంటలకె కాదు ఇంటి అవసరాలకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి. సొల్లు కబుర్లు చెప్పే వారిని నమ్మొద్దు. అధికారం ఉన్న వారికి పట్టం కడితే మరింత అభివృద్ధి చేసి చూపుతాం. నియోజకవర్గ పరిధిలో, కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అర్హులైన వారికి అన్ని సంక్షేమ పథకాలను అందిస్తాం. అన్ని రోడ్లను, మౌలిక వసతులను తీర్చేది శ్రీనన్న మాత్రమే. ఇళ్ల స్థలాలు ఇచ్చేది నేనే, ఇల్లు ఇచ్చేది నేనే. ఇండిపెండెట్ లు లేరు, మరొక పార్టీ లేదు కేవలం హస్తం గుర్తు, సుత్తి కొడవలి నక్షత్రం మాత్రమే. కొత్తగూడెం కార్పొరేషన్ లో సీపీఎం సహకారంతో 60 డివిజన్ల కు గాను 57 డివిజన్ల కు పైగా గెలిచి తీరుతామని అన్నారు.



