ఓటు అమ్ముకొనేది, కుదవ పెట్టేది కాదు
ఈటల
మేడ్చల్
Votes are sold, not bribed
Eetala
ఈటల రాజేందర్ గారు మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేశవరంలో..మంగ నరేందర్ గౌడ్, సత్యనారాయణ ఇద్దరు అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించండి అని మీ చేతుల్లో పెట్టడానికి మేము వచ్చామని అన్నారు.
నన్ను మీరు గెలిపించి సంవత్సరన్నర అయింది. నా దగ్గరికి ఎవరు వచ్చినా అడుక్కున్నట్టు రావద్దు. హక్కు దారులుగా రావాలని చెప్పాను. ఇది మీ ఇల్లు మీ ఆఫీస్ అని చెప్పాను. సద్ది తిన్న రేవును తలిచే జాతి తెలంగాణ జాతి. నాయకున్ని ఎన్నుకునేది సేవ చేయడానికి తప్ప వ్యాపారం చేయడానికి కాదు. కౌన్సిలర్ ఎమ్మెల్యే ఎంపీ పదవి ఏదైనా మీ ఓట్లకు పుట్టింది. రాజకీయ నాయకులు సేవకులుగా ఉండాలి తప్ప వ్యాపారాలుగా ఉండకూడదు. సేవ చేసేవాడు డబ్బులు ఇవ్వడు వ్యాపారం చేసేవాడు మాత్రమే ఇస్తాడు. డబ్బులు ఇచ్చిన వాడికి మళ్లీ డబ్బులు సంపాదించుకోవాలని యావ ఉంటుంది తప్ప పేదలకు సేవ చేయాలనే తపన ఉండదు. మన ఓటు అమ్ముకొనేది, కుదవ పెట్టేది కాదని అన్నారు.
భారతీయ జనతా పార్టీ ఇల్లు ఇప్పిచ్చిన పార్టీ తప్ప పేదల ఇళ్లను గుంజుకున్న పార్టీ కాదు. వాజ్పేయి నగర్, బద్దం బాలరెడ్డి నగర్, అద్వానీ నగర్ ఇవన్నీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం పేదలకు ఇల్లు ఇప్పించింది కాబట్టి వారు ప్రేమతో పెట్టుకున్న పేర్లు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పేదల స్థలాలను గుంజుకుంటున్నారు, ఇళ్లను కూలగొడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకుంది భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ నేతగా మీ ఈటల రాజేందర్ అని గుర్తుపెట్టుకోండి. మీకు చేతనైతే చెప్పిన హామీలను నెరవేర్చండి. అంతే తప్ప పేదల ఉసురు పోసుకోవద్దనీ రేవంత్ రెడ్డికి హెచ్చరించారు.
నన్ను కోసిన రూపాయి లేదని స్వయంగా ఒక ముఖ్యమంత్రి అంటాడా ? సబ్బు బిళ్ళకొన్నా, అగ్గిపెట్టె కొన్నా మనం కట్టే టాక్స్ పైసలతోనే మనకు పథకాల అందిస్తున్నారు తప్ప వారి ఇంటి నుంచి ఇవ్వడం లేదు.
ఒక్క లిక్కర్ మీదనే 50 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వం పెన్షన్ కోసం ఇచ్చే డబ్బులు 12 వేల కోట్లు. ఇవన్నీ చూశాక కూడా కాంగ్రెస్ కి ఓటు వేస్తారా. ? బీఆర్ఎస్ ను ఎందుకు ఓడించినం..ఆయనేదో తెలంగాణ కు మంచి చేస్తారని అనుకుంటే… తన కుటుంబం తన సంపాదన.. తానొక రాజు లెక్క, చక్రవర్తి లెక్క ఉన్నారని బొందపెట్టాము. మళ్ళీ ఆ పార్టీకి ఓటు ఎలా వేస్తాం
రాబోయే కాలమంతా నరేంద్ర మోడీ దే..మన సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలు, దేవాలయాలు, భారతజాతి కీర్తి పతాక, పేదల కడుపు ఆలోచించేవారు నరేంద్ర మోడీ. మనం తింటున్న ఐదు కేజీల బియ్యం నరేంద్ర మోడీ అందిస్తున్నారు మున్సిపాలిటీలకు కూడా డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి బిజెపి అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని అన్నారు.



