Saturday, February 14, 2026

 కపుల్ ఫ్రెండ్లీ అంటున్న ఈషా

- Advertisement -

 కపుల్ ఫ్రెండ్లీ అంటున్న ఈషా
హైదరాబాద్ ఫిబ్రవరి 13

Isha says she is couple friendly
తెలుగు తెరపై ఈ మధ్య కాలంలో తెలుగు హీరోయిన్స్ జోరు పెరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది. కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, కొత్త కథానాయికలను పరిచయం చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఓ మాదిరి బడ్జెట్ సినిమాల ద్వారా పరిచయమవుతున్న ఈ కథానాయికలు, ఆ తరువాత తమ టాలెంట్ తో నిలదొక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అటు ఆంధ్ర నుంచి మాత్రమే కాదు, ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా పరిచయమవుతున్న హీరోయిన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వరంగల్ నుంచి తెలుగు తెరకి పరిచయమైన ఆనంది, తమిళంలో స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఇప్పటికీ తెలుగులో సినిమాలు చేస్తోంది. ఈషా రెబ్బా కూడా తనదైన స్టైల్లో సినిమాలు .. సిరీస్ లు చేస్తూ వెళుతోంది. ఇక వైష్ణవి చైతన్య ‘బేబీ’ సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘మానస వారణాసి’ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అందాల పోటీల్లో అనేక బహుమతులు గెలుచుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో అలరించనుంది.
మానస వారణాసి ఇంతకు ముందు ఒక సినిమా చేసినప్పటికీ, కొన్ని కారణాల వలన అది ఆడియన్స్ కి రీచ్ కాలేదు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ మాత్రం రిలీజ్ కి ముందే మంచి బజ్ తెచ్చుకుంది. ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తూ ఉండటంతో, యూత్ అంతా ఈ సినిమాపైనే ఫోకస్ పెట్టింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు, పొయెటిక్ గా అనిపించేలా రొమాన్స్ ఉంటుందని చెప్పడం యూత్ ను ఎక్కువగా ఆకర్షిస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో, సంతోష్ శోభన్ జోడీగా మానస వారణాసి తొలి హిట్ కొడుతుందేమో చూడాలి మరి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్