Friday, March 13, 2026

మైనర్ బాలికపై అత్యాచారం. ఆపై హత్య.! కట్ చేస్తే.. తెల్లారి చెరువులో డెడ్‌బాడీగా..

- Advertisement -

మైనర్ బాలికపై అత్యాచారం.
ఆపై హత్య.! కట్ చేస్తే.. తెల్లారి చెరువులో డెడ్‌బాడీగా..
తిరుపతి, ఫిబ్రవరి 18

Rape of a minor girl.
And then murder.! If you cut it.. Dead body in Tellari lake..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లె బాలిక హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ మృతి చెందాడు. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం కనిపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని మదనపల్లెకు తరలిస్తున్నారురాష్ట్రాల్లో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లె బాలిక హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ మృతి చెందాడు. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం కనిపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని మదనపల్లెకు తరలిస్తున్నారు. నిన్న హత్యాచారం అనంతరం నిందితుడు పరారైనట్టు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. అటు నీరుగట్టువారిపల్లిలోని కులవర్ధన్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు మరికాసేపట్లో హత్యకు గురైన చిన్నారి డెడ్ బాడీకి అంత్యక్రియలు జరగనున్నారు. స్వగ్రామం వీరబల్లి మండలంలో అంత్యక్రియలు చేయనున్నారు.అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న అమానుష ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతదేహానికి డాక్టర్లు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆ తర్వాత చిన్నారి భౌతికకాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.  వైద్య పరీక్షలు, పోలీసు దర్యాప్తులో అత్యంత దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం నివేదిక ప్రకారం బాలికపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు ధృవీకరించారు. నిందితుడు అత్యంత కిరాతకంగా చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, ఆపై పాపను నీళ్ల డ్రమ్ములో ముంచి ఊపిరాడకుండా చేసి
హత్య చేశాడని నిర్ధారణ అయ్యింది.మదనపల్లెకి చెందిన 7 ఏళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. సోమవారం స్కూల్‌కు సెలవు ఇవ్వడంతో ఇంటి వద్ద ఉన్నది. మరోవైపు తల్లి పనికి వెళ్లింది. బాలిక ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం 4.30 గంటలకు తల్లి ఇంటికి ఫోన్ అడగగా చిన్నారి ఇంట్లో లేదని, ఆడుకోవడానికి ఫ్రెండ్స్ వద్దకు వెళ్లి ఉంటుందని భావించారు. ఎంతకు తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ టీం రంగంలోకి గాలింపు చేపట్టింది. స్థానికంగా ఎవరూ తెలియదని చెప్పడంతో చివరికి బాలిక ఎదురింట్లో ఉంటున్న కులవర్ధన్‌ ఇల్లు రాత్రి 1.30 గంటలకు గాలించడానికి వెళ్లారు. ఎంత తలుపుకొట్టినా కులవర్ధన్‌ తలుపు తీయలేదు. కిటికీలోంచి చూస్తే నిద్రపోతున్నట్లు కనిపించాడు. బాలిక తాత మాత్రం చివరగా కులవర్ధన్‌తోనే బాలిక కనిపించిందని చెప్పడంతో మంగళవారం ఉదయం మళ్లీ అతడి ఇంటికి వెళ్లి చూడగా దారుణం వెలుగు చూసింది. డ్రమ్ములో బాలిక మృతదేహమై ఉండటాన్ని గుర్తించి అంతా షాకయ్యారు. ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక శవంగా కనిపించిన సంగతి తెలిసిందే. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. ఇంటికి సమీపంలోనే బాలిక ఓ డ్రమ్ములో శవమై కనిపించింది. కులవర్ధన్‌ అనే వ్యక్తిని అనుమానించారు పోలీసులు. ఈ కులవర్ధన్‌ బాలిక ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్నాడు. అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసి డ్రమ్ములో కుక్కి చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. అతడి డెడ్ బాడీ ఈ ఉదయం చెరువులో దొరికింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్