Tuesday, March 10, 2026

భారీ అంచనాలతో ఉస్తాద్ ఊపు

- Advertisement -

భారీ అంచనాలతో ఉస్తాద్ ఊపు

Ustad Oopu with huge expectations

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే  సుమారు రూ. 41 లక్షలు) పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.. పవన్ కల్యాణ్కు విదేశాల్లో ఉన్న బలమైన ఫ్యాన్ బేస్, అలాగే హరీశ్ శంకర్తో ఆయన కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్బస్టర్ సినిమా ఉండటంతో ఈ క్రేజ్ ఏర్పడింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, నార్త్ అమెరికా మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ జోరు చూస్తుంటే ప్రీమియర్లతోనే భారీ వసూళ్లు రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్