Monday, March 23, 2026

Hopes Pinned on Summer Movies

- Advertisement -

సమ్మర్ మూవీస్ పై ఆశలు
హైదరాబాద్, మార్చి 23, (వాయిస్ టుడే)

Hopes Pinned on Summer Movies
సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీల హవా కొనసాగుతుందనే చెప్పాలి. సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో చిరంజీవి భారీ సక్సెస్ ని సాధించాడు. 400 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. సంక్రాంతి సీజన్ బాగా కలిసి రావడంతో ఆ తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీకి భారీ లాభాలు వస్తాయని అంచనాలో సినిమా మేధావులైతే ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సైతం పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతుంది. ఇక అడివి శేషు హీరోగా చేస్తున్న ‘డకాయిట్’ సినిమా సైతం ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే శర్వానంద్ బైకర్ సినిమా వస్తుంది. నిఖిల్ హీరోగా చేస్తున్న స్వయంభూ సినిమా కూడా ఈ సమ్మర్ లోనే వస్తుంది…ఇక ఈ సినిమాలతో పాటు గా ఏప్రిల్ 30 వ తేదీన రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ‘పెద్ది’ సినిమా సైతం భారీ అంచనాలతో బరిలోకి దిగబోతుంది.ఇక మే నెలలో ఏ సినిమాలు రాబోతున్నాయి అనే విషయం మీద ఇంకా సరైన క్లారిటి రానప్పటికి మొత్తానికైతే ఈ సినిమాలన్ని భారీ విజయాలను సాధిస్తాయనే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు. పెద్ది సినిమా ఈ సమ్మర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలువబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అంటూ మేకర్స్ చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన హైప్ కూడా ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేలా రామ్ చరణ్ పెద్ది సినిమాతో భారీ రికార్డులను కొల్లగొడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంతవరకు డౌన్ లో ఉంది.దీనిని టాప్ లెవెల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత రామ్ చరణ్ మీదే ఉంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది. తద్వారా మరోసారి తెలుగు సినిమా స్థాయి పెరుగుతుందా లేదా అనేది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్