Saturday, March 28, 2026

 31నే గణపతి లొంగుబాటు

- Advertisement -

 31నే గణపతి లొంగుబాటు
వరంగల్, మార్చి 28, (వాయిస్ టుడే )

Ganapathi’s Surrender on the 31st Itself
మావోయిస్టు అగ్రనేత గణపతి త్వరలో లొంగిపోనున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ నేపాల్ లో ఉన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం. అయితే ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత వందల సంఖ్యలో మావోయిస్టు నేతలు హతమయ్యారు. అనేక మంది అగ్ర నేతలు, తమ అనుచరులు, ఆయుధాలతో సహా లొంగిపోయారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు లొంగుబాటు కోసం విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అంటే ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది.అయితే ఇప్పటి వరకూ లొంగిపోయిన అగ్రనేతలు చాలా వరకూ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారికి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ముందుుకు వచ్చింది. అయితే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత రామన్న అలియాస్ గణపతి అలియాస్ లక్ష్మణరావు ఈ నెల 31వ తేదీన లొంగిపోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు ముందుగానే గణపతి ససమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఆయనపై కోట్ల రూపాయల రివార్డు ఉంది. పలు కీలక కేసుల్లో నిందితుడిగా ఉన్న గణపతి లొంగితే మావోయిస్టు పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయినట్లేనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో గణపతి నేరుగా నేపాల్ నుంచి హైదరాబాద్ కు చేరుకుని తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికీ ఒడిశా, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఆపరేషన్ నిర్వహిస్తుంది. సాయుధ బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. ఈ నాలుగు రోజుల్లో ఎన్ కౌంటర్లతో పాటు లొంగుబాట్లు కూడా ఉంటాయని చెబుతున్నారు. మిసిర్ బిస్రా అలియాస్ భాస్కర్ ఝార్ఖండ్ లో ఉన్నారని గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ వరా ల నుంచి అందుతున్న సమాచారమ మేరకు గణపతి లొంగిపోయేందుకు తన అంగీకారాన్ని తెలిపినట్లు చెబుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్