Friday, April 3, 2026

 అమరావతికి రాజ్యసభ ఆమోదముద్ర మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్

- Advertisement -

 అమరావతికి రాజ్యసభ ఆమోదముద్ర
మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2

Rajya Sabha Gives Its Seal of Approval to Amaravati
BRS Declares Support
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన (సవరణ) బిల్లు-2026కు రాజ్యసభలో ఘనమైన ఆమోదం లభించింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై గురువారం ఎగువసభలో

సుదీర్ఘ చర్చ జరిగింది. లోక్‌సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించగా, నేడు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపడంతో అమరావతికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించే దిశగా మరో కీలక అడుగు పడింది. పదకొండు

రాజకీయ పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు ఈ చర్చలో పాల్గొని ఏపీ రాజధానిగా అమరావతికి తమ మద్దతు ప్రకటించారు.ఈ చర్చలో అనూహ్య రీతిలో ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నీ ఏకగ్రీవంగా అమరావతికి

మద్దతు పలికాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపి, జనసేన వంటి పార్టీలతో పాటు తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి  కూడా ఈ బిల్లును సమర్థించింది.  గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఈ బిల్లు ముగింపు

పలుకుతుందని ఎంపీలు పేర్కొన్నారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రస్తావిస్తూ, రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చే పరిహారంపై స్పష్టత

లేదని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది.చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి, ఏపీ రాజధాని విషయంపై ఇంతకాలం ఆలస్యం జరగడం పార్లమెంటు వైఫల్యమని, ఇప్పటికైనా సరైన నిర్ణయం

తీసుకున్నందుకు సంతోషమని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రసంగిస్తూ, ఇది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అని ఉద్వేగభరితంగా

చెప్పారు. 2014 విభజన గాయాలను ఈ చట్టం మాన్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీలు తమ ప్రసంగాల్లో అమరావతిని బెంగళూరు, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరారు.తెలంగాణ

ప్రాంత ప్రయోజనాలకు భంగం కలగకుండా, పొరుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం తమకు ఇష్టమని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీకి ఒక శాశ్వత రాజధాని ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాల మధ్య మరింత

సహకారం పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రధాన పార్టీలు అమరావతికే ఓటు వేయడంతో సభలో ఒక అరుదైన ఏకాభిప్రాయం కనిపించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

నిత్యానంద రాయ్ చర్చకు సమాధానం ఇస్తూ, ఏపీ ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇస్తూనే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కేవలం వాయిస్ ఓట్  ద్వారా బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు చైర్మన్

ప్రకటించడంతో ఏపీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  పార్లమెంటులోని ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించినందున  ఇది తదుపరి దశలో  రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తుంది. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే

ఇది చట్టంగా మారుతుంది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనివల్ల ఏపీ రాజధానిగా అమరావతికి రాజ్యాంగబద్ధమైన హోదా లభిస్తుంది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ

చట్టాన్ని మార్చడం దాదాపు అసాధ్యమవుతుంది.
రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
రాజ్యసభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత  వైవీ సుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.  రాజ్యసభలో అమరావతి బిల్లుపై మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి,

ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక  పెద్ద డ్రామా గా అభివర్ణించారు. ప్రస్తుత రూపంలో ఉన్న అమరావతి బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. అసలు రాజధాని నిర్ణయం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ

పరిధిలోని అంశమని గతంలో కేంద్రమే అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేస్తూ, మరి ఇప్పుడు కేంద్రం ఈ బిల్లును ఏ ప్రాతిపదికన ప్రవేశపెట్టిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రానికి బిల్లు పెట్టే అధికారం లేదన్నారు.

అమరావతి నిర్మాణం వల్ల రాష్ట్రంపై పడే ఆర్థిక భారాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ. 2 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారని, మొత్తం ప్రాజెక్టుకు అవసరమైన రూ. 2 లక్షల కోట్లు

ఎక్కడి నుంచి తెస్తారని  ప్రశ్నించారు.  ఇప్పటికే వడ్డీల రూపంలోనే రూ. 20 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలో ప్రతి చదరపు అడుగుకు రూ. 12 వేలకు పైగా ఖర్చు

చేస్తున్నారని, దీని వెనుక పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం గతంలో మూడు రాజధానుల  నిర్ణయం తీసుకుందని వైవీ

సుబ్బారెడ్డి  తెలిపారు.   అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతూనే, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్‌గా చేయాలన్నదే తమ విధానమని చెప్పారు. అమరావతి ప్రాంతం

వరదలతో మునిగిపోతుందని ఇప్పటికే ఆధారాలు ఉన్నాయని, అటువంటి ప్రాంతంలో వేల కోట్లు కుమ్మరించడం సరైన నిర్ణయం కాదని వాదించారు. అసెంబ్లీలో సరైన చర్చ జరపకుండానే తీర్మానం చేశారని సుబ్బారెడ్డి

మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం ఒక ప్రాంతానికే పరిమితమై మిగిలిన ప్రాంతాలను విస్మరిస్తోందని విమర్శించారు. తన ప్రసంగం అనంతరం, బిల్లుకు నిరసనగా వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ సభ్యులు

రాజ్యసభ నుంచి  వాకౌట్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్