అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్లిన కారు
భార్యభర్తలు మృతి,
Car Spins Out of Control and Plunges into Irrigation Canal
తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివారు
కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది.
మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్(40), భార్య భోగిల్లి కిరణ్మయి(36), తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి, అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



