Friday, May 1, 2026

ఇఃష్టపడి ఖర్చు పెట్టి… ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వను కోర్టులో అషురెడ్డి

- Advertisement -

 ఇఃష్టపడి ఖర్చు పెట్టి…
ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వను
కోర్టులో అషురెడ్డి
హైదరాబాద్, మే 1, (వాయిస్ టుడే)

In the court Ashureddy does not know from where he gives
ఎన్నారై వేసిన కేసుతో అషూ రెడ్డి పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో ఎంతలా చక్కర్లు కొడుతోందో అందరికీ తెలిసిందే. తనను మోసం చేసి 9.3 కోట్లు కాజేసిందంటూ ఎన్నారై పెట్టిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అవన్నీ అవాస్తవాలు అని, తన మీద తప్పుడు వార్తలు రాసే వారిని ఉపేక్షించబోనని, లీగల్‌గా చర్యలు తీసుకుంటాను అని అషూ రెడ్డి ఇన్ స్టాలో పోస్ట్ వేసింది. తాజాగా అషూ తన వాదనల్ని హైకోర్టులో వినిపించినట్టుగా సమాచారం.ఇద్దరి మధ్య పెళ్లికి గానీ, ఈ లెక్కలకు గానీ సంబంధించిన రాతపూర్వక అగ్రిమెంట్స్ ఎలాంటివీ లేవని, ఆయన ఇష్టపూర్వకంగానే ఆ ఖర్చులన్నీ చేశారని అషూ రెడ్డి తన వాదనల్ని వినిపించినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎలాంటి బలవంతం లేదని చెప్పిందట. తనను, తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించే క్రమంలోనే, తన కుటుంబాన్ని మచ్చిక చేసుకునేందుకే అవన్నీ ఖర్చు పెట్టాడని అషూ రెడ్డి పేర్కొందట.అతను తన వ్యక్తిగత నిర్ణయం మేరకు చేసిన ఖర్చులకు తాను ఎలాంటి బాధ్యత వహించబోనని, తనకు వాటితో సంబంధం లేదని అషూ రెడ్డి చెప్పుకొచ్చిందట.  సీసీఎస్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఎలాంటి వాస్తవాలు లేవని, అందుకే ఆ కేసుని కొట్టేయాలని కోర్టులో ఆమె అభ్యర్థించినట్టుగా సమాచారం. ఈ కేసుని, అషూ వాదనల్ని విన్న కోర్టు.. ఈ కేసులోని లోటుపాట్లను పరిశీలించేందుకు సిద్ధమైంది. అషూ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై పూర్తి వివరాల్ని సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ కౌన్సిల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.మరి ఈ కేసులో మున్ముందు ఎలాంటి వాదనలు వినాల్సి వస్తుందో.. చివరకు న్యాయం ఎవరి వైపు ఉందో.. తీర్పు ఎలా వస్తుందో చూడాలి. మొత్తానికి ఈ వ్యవహారంతో అషూ రెడ్డి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. మొన్నటి వరకు ఇన్ స్టా సబ్ స్క్రిప్షన్‌తో అషూ రెడ్డి నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలా ఈ కేసుతో మరోసారి ట్రెండ్ అవుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్