తండ్రి ప్రాణాలు తీసిన నాటుకోడి కూర
జనగామ
The chicken curry that took the father’s life
నాటుకోడి విషయంలో తలెత్తిన గొడవ లో వ్యక్తి మృతి చెందాడు. కోడికూర ఘర్షణలో తండ్రిపై కొడుకు రోకలిబండతో దాడికి దిగాడు. తండ్రి రమేష్ తీవ్ర రక్తస్రావమై కింద పడిపోయాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో ఘటన జరిగింది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో నాటుకోడి తెచ్చి భార్యను కూర వండమని రైతు జంగిలి రమేష్ చెప్పాడు. రాత్రి అవుతుంది వద్దని భర్తకు భార్య నచ్చచెప్పింది. దాంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తన తల్లిని ఎందుకు తిడుతున్నామని తండ్రిని కుమారుడు గణేష్ ప్రశ్నించాడు. నన్నే ప్రశ్నిస్తావా.. అంటూ కొడుకు గణేష్ ను చంపపై తండ్రి రమేష్ కొట్టాడు. క్షణికావేశానికి గురైన గణేష్ పక్కనే ఉన్న రోకలిబండతో తన తండ్రిపై తలపై దాడి చేసాడు. తీవ్ర రక్తస్రావమై కింద పడిపోయిన రమేష్ . ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.



